ఏసీ బంద్, టోకెన్ సిస్టమ్ రద్దు, సోషల్ డిస్టెన్స్-మాస్కులు మస్ట్.. మెట్రో రైళ్లలో కొత్త రూల్స్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సెప్టెంబర్ 7వ తేదీ నుంచి హైదరాబాద్, ఢిల్లీ, కోల్ కతాలో మెట్రో రైళ్లు పట్టాలెక్కనున్నాయి. కరోనా నేపథ్యంలో కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా మెట్రో రైళ్లలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మరి గతంలో మాదిరి మెట్రో రైళ్లలో ఏసీ ఉంటుందా? టోకెన్ సిస్టమ్ ఉంటుందా? టికెట్ కౌంటర్ ముందు క్యూ ఉంటుందా? సీటింగ్ విధానం ఎలా ఉండబోతోంది? ఒక్కో కోచ్ లో ఎంతమంది ప్రయాణికులను అనుమతిస్తారు? అన్ని స్టేషన్లూ పని చేస్తాయా? కోవిడ్ కట్టడికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?స్మార్ట్ కార్డులు, డిజిటల్ పేమెంట్స్ తో టికెట్లు:
అన్ లాక్ 4 లో భాగంగా మెట్రో సర్వీసులకు కేంద్రం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైళ్లు పట్టాలెక్కేందుకు రెడీ అవుతున్నాయి. గతంలో మాదిరి కాకుండా టోకెన్ సిస్టమ్ రద్దు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం స్మార్ట్ కార్డులతో ప్రయాణానికి అనుమతి ఇస్తామని తెలిపింది. మెట్రో రైలు టికెట్లలో భాగంగా ఇచ్చే టోకెన్ల విధానాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. కేవలం స్మార్ట్ కార్డులు, డిజిటల్ పేమెంట్ల పద్ధతిలోనే ప్రయాణికులను అనుమతిస్తామని వెల్లడించింది.

భౌతిక దూరం, మాస్కులు, థర్మల్ స్క్రీనింగ్ మస్ట్:
మెట్రో ప్రయాణికులు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకుంటామని ఢిల్లీ ప్రభుత్వం చెప్పింది. ఎంట్రన్స్ లో ప్రతి ప్రయాణికుడికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తామన్నారు. ఇక హైదరాబాద్ లోనూ సెప్టెంబర్ 7 నుంచి మెట్రో సర్వీసులు తిరిగి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. లిఫ్టుల్లో సోషల్ డిస్టేన్స్ పాటించేలా ఫుట్ ప్రింటింగ్ చేయాలని మెట్రో అధికారులు నిర్ణయించారు. మెట్రో డోర్ దగ్గర రెండు లైన్లలో ప్రయాణికులు వెయిట్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ లో మెట్రో ప్రయాణికులు 4 లక్షల మంది ఉండగా, వీరిలో 2 లక్షల మంది మెట్రో కార్డులు వాడుతున్నారు. దీంతో హైదరాబాద్ లోనూ టికెటింగ్ విధానంలో స్మార్ట్ కార్డులు, డిజిటల్ పేమెంట్లని అనుమతించే అవకాశం ఉంది.

హైదరాబాద్‌లో మెట్రో రైల్ సర్వీసుల ప్రారంభంపై నీలినీడలు, సెప్టెంబర్ 7 నుంచి డౌటే, కారణాలు ఇవే


మెట్రో రైళ్లలో కొత్త మార్పులు
* టోకెన్ల విధానం రద్దు
* ఒక్కో కోచ్ లో పరిమిత సంఖ్యలో ప్రయాణికులు(ఇంకా సంఖ్యను నిర్దారించ లేదు)
* ఏసీలో గణనీయమైన మార్పులు.. నిత్యం కోచ్ లలోకి పెద్ద ఎత్తున తాజా గాలి వచ్చేలా ఏర్పాట్లు
* ఏసీ టెంపరేచర్ ఎంత ఉంచాలి అనే దానిపై త్వరలో నిర్ణయం
* అన్ని స్టేషన్లలో మెట్రో రైళ్లు ఆగవు, సెలెక్టడ్ స్టేషన్స్ లోనే నిలుపుతారు
* ప్రయాణికులకు భౌతిక దూరం, మాస్కులు, థర్మల్ స్క్రీనింగ్ మస్ట్

* కరోనా వ్యాప్తిని పెంచే ప్రమాదం ఉండటంతో టోకెన్ సిస్టమ్ పూర్తిగా రద్దు
* ప్రతి టోకెన్ ని ప్రతి సారి శానిటైజ్ చేయడం అసాధ్యం
* స్మార్ట్ కార్డులు లేదా రీచార్జ్ మీడియమ్స్ అమలు
* కంటైన్ మెంట్ జోన్స్ లోని మెట్రో స్టేషన్లు మూసివేత
* సోషల్ డిస్టేన్స్ ఉండేలా సీటింగ్ అరేంజ్ మెంట్స్

Related Posts