లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

కులం వల్ల కాదు టాలెంటే మనిషికి గొప్ప – బీజేపీ మంత్రి

Published

on

కులాన్ని బట్టి కాదు మనిషిలోని టాలెంట్ ఇంపార్టెంట్ అని అంటున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. కులాలు, మతాలు, కమ్యూనిటీలకు పొలిటికల్ పార్టీలలో ఇంపార్టెంట్ ఉండదని కేవలం టాలెంట్ కే అని చెబుతున్నారు గడ్కరీ. పొలిటికల్ పార్టీల్లో మైనారిటీ కమ్యూనిటీ, షెడ్యూల్ కులాల గురించి ఆయన మాట్లాడారు.

తూర్పు విదర్భ ప్రచారంలో పాల్గొన్న సందీప్ జోషిని ప్రస్తావిస్తూ.. ‘నాకు స్పష్టమైన అభిప్రాయం ఉంది. వ్యక్తి కులం చేత గొప్ప కాదు టాలెంట్ ఉన్నవాడే గొప్ప. బీజేపీలోని పలు కులాలు ఉన్నాయి. నేను పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఇది ఎక్స్‌పీరియన్స్ అయ్యాను కూడా’



‘ఏ గొప్పదనం కులం, మతం నుంచి రాదనే అభిప్రాయం నాకుంది. వాటి వల్ల ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. వాటిని రిప్రజెంట్ చేసేవాళ్లు కూడా పార్టీలో ఎక్కువ టిక్కెట్స్ సంపాదించలేరు’

‘నేనెప్పుడూ చెబుతూ ఉంటాను. మా పార్టీ, మా వర్కర్లు మా కుటుంబం. మేమెప్పుడూ కులం, కమ్యూనిటీలపై రాజకీయం చేయలేదు. బాగా పనిచేసే వారి వెంటే ఉన్నాం. వారిని కుటుంబ సభ్యులుగానే ఫీల్ అయ్యాం. అదే బీజేపీ ప్రత్యేకత’ అని అన్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *