Home » పాక్‌లో నో వాట్సాప్.. ఎఫ్బీ మెసేంజర్ : మూడు కొత్త యాప్‌ల్లోకి స్విచ్ అవుతున్న ఉగ్రవాద గ్రూపులు!
Published
1 month agoon
Terror groups in Pak switch to new messaging apps : ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ కొత్త ప్రైవసీ రూల్స్ తీసుకొస్తోంది. ప్రైవసీ పరంగా ఇబ్బందులు ఉంటాయని యూజర్లంతా కొత్త యాప్ లకు స్విచ్ అయిపోతున్నారు. మెసేంజర్ యాప్ సిగ్నల్ యాప్‌కు ఎక్కువగా స్విచ్ అవుతున్నారు. అయితే అందరితో పాటు పాకిస్తాన్ లోని ఉగ్రవాద గ్రూపులు కూడా వాట్సాప్ వదిలేస్తున్నాయంట.. నో వాట్సాప్.. నో ఎఫ్ బీ మెసేంజర్ యాప్ అంటూ కొత్త అప్లికేషన్ లోకి స్విచ్ అయిపోతున్నారంట..
అందరూ సిగ్నల్ యాప్ కు స్విచ్ అవుతుంటే.. టెర్రర్ గ్రూపులు మాత్రం టర్కీష్ కంపెనీ డెవలప్ చేసిన కొత్త అప్లికేషన్ లోకి స్విచ్ అవుతున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాద గ్రూపులు ఈ మూడు కొత్త అప్లికేషన్లకు స్విచ్ అవుతున్నారంటూ పట్టుబడిన ఉగ్రవాదులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఉగ్రవాదులు ఆర్మీకి ఇచ్చిన వివరాల్లో పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద గ్రూపుల రాడికలైజేషన్ గురించి బయటపెట్టారు. అయితే ఏయే అప్లికేషన్లకు ఉగ్రవాద గ్రూపులు స్విచ్ అవుతున్నారు అనే విషయాన్ని భద్రతా కారణాల రీత్యా బహిర్గతం చేయలేదు.
అందులో ఒకటి అమెరికాకు చెందిన మెసేంజర్ యాప్ కాగా.. రెండోది యూరప్ కంపెనీకి చెందినది.. ఇక లేటెస్ట్ అప్లికేషన్ టర్కీష్ కంపెనీ డెవలప్ చేసిన యాప్.. కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల నియామకాల కోసం తరచుగా ఇదే యాప్ ను వాడుతున్నారంట.
ఏపీలో స్కూళ్లు, కాలేజీలకు 2నెలలు సెలవులు.. నిజం ఏంటంటే..
సోషల్ మీడియా వాడుతున్నారా.. అయితే బీఅలర్ట్
యూజర్లకు వాట్సాప్ షాక్.. కొత్త టర్మ్స్ రిజెక్ట్ చేస్తే.. మెసేజ్‌లు ఆపేస్తోంది!
సేఫ్ వాట్సప్ కోసం.. హ్యాకర్ల భారిన పడకుండా ఉండేందుకు ఏం చెయ్యాలంటే?
వాట్సప్ ప్రైవసీ పాలసీ మే15లోపు యాక్సెప్ట్ చేయకపోతే..
సాయం కోరిన విద్యార్థినితో ప్రొఫెసర్ పాడు పని, బాగోతం బయటపెట్టిన వాట్సాప్