లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-1

Nokia 4G కొత్త ఫీచర్ ఫోన్లు వచ్చేశాయ్..!

Published

on

Nokia 8000 4G, Nokia 6300 4G Feature Phones : ప్రముఖ హెచ్ఎండీ గ్లోబల్ కంపెనీ నోకియా కొత్త 4G ఫీచర్ ఫోన్లను ప్రవేశపెట్టింది. Nokia 8000 4G, Nokia 6300 4G అనే రెండు రకాల మోడల్ ఫీచర్ల ఫోన్లను మార్కెట్లోకి రిలీజ్ చేసింది.ఈ ఫోన్లలో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 210 ప్రాసెసర్, 1,500mAh రిమూవబుల్ బ్యాటరీ అందిస్తోంది. నోకియా 8000 4G ఫోన్‌లో 2MP రియర్ కెమెరాతో పాటు ఫ్లాష్ అఫర్ చేస్తోంది.

మరో మోడల్ నోకియా 6300 4G ఫీచర్ ఫోన్‌లో VGA కెమెరా, ఫ్లాష్ అమర్చారు. నోకియా 8000 ఫోన్ 2.8 అంగుళాల QVGA డిస్‌ప్లేతో కాస్తా పెద్దగా ఉంటుంది.అలాగే నోకియా 6300 4G ఫోన్ 2.4 అంగుళాల QVGA డిస్ ప్లేతో చిన్నగా వచ్చింది. ఈ రెండు ఫోన్లలో కీప్యాడ్ డిస్‌ప్లే స్ర్కీన్ కిందిభాగంలో అమర్చారు. టెక్సిటింగ్, ఈమెయిల్, కాలింగ్ కోసం వినియోగించుకునేలా రూపొందించారు.ఫీచర్లు + స్పెషిఫికేషన్లు ఇవే :
Nokia 8000 4G, Nokia 6300 4G రెండు ఫోన్లు KaiOS ఆపరేటింగ్ సిస్టమ్ పై రన్ అవుతాయి. డ్యుయల్ సిమ్ (నానో+నానో) స్లాట్ ఉన్నాయి. నోకియా 8000 4G ఫోన్‌లో 2.8 అంగుళాల QVGA డిస్‌ప్లే అందించారు.Nokia 6300 4G ఫోన్ చిన్నగా 2.4 అంగుళాలతో QVGA డిస్‌ప్లేతో వచ్చింది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 210 ప్రాసెసర్, 4GB ఇంటర్నల్ స్టోరేజీ ఉంది. మైక్రో SD కార్డు ద్వారా 32GB వరకు స్టోరేజీ ఎక్స్ ఫ్యాండ్ చేసుకోవచ్చు.

నోకియా 8000 4G ఫీచర్ ఫోన్‌లో 512MB RAM అందించగా.. స్టోరేజీ 4GB వరకు అందిస్తోంది. నోకియా 6300 4G స్మార్ట్ ఫోన్ లో VGA రియర్ కెమెరా కలిగి ఉంది. రెండు ఫీచర్ ఫోన్లలో ఫ్లాష్ లైట్ సపోర్ట్ ఉంది. బ్యాటరీ సామర్థ్యం 1,500mAh రిమూవబుల్ బ్యాటరీ అందిస్తోంది.మైక్రో USB స్లాట్, 3.5mm ఆడియో జాక్ కూడా ఉన్నాయి. రెండు ఫోన్లలో FM రేడియో సపోర్ట్ ఉంది. A-GPS కనెక్టవిటీ కూడా ఉంది. Nokia 8000 4G ఫోన్‌ బరువు 132.2×56.5×12.34mm (110.2) గ్రాములు ఉంటుంది. నోకియా 6300 4G పరిమాణం 131.4×53.0x13.7mm (104.7) గ్రాములు ఉంటుంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *