ఈ నెల 23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

non-agricultural lands registration : వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవంబర్ 23 నుంచి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

ధరణి పోర్టల్‌పై సీఎం సమీక్ష ముగిసింది అనంతరం భూ రిజిస్ట్రేషన్‌తో చారిత్రక శకం ఆరంభమైందని కేసీఆర్ అన్నారు.వచ్చే సోమవారం రిజిస్ట్రేషన్ ప్రక్రియను సీఎస్ ప్రారంభించనున్నారు. సీఎస్ సోమేశ్ కుమార్ ప్రారంభిస్తారని కేసీఆర్ తెలిపారు. ఇప్పటికే ధరణి పోర్టల్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు.

ధరణి పోర్టల్ ద్వారా ప్రభుత్వం ప్రారంభించిన వ్యవసాయ భూములతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రజాదరణ పొందుతున్నదని ఆయన అన్నారు.వ్యవసాయ భూములకు భరోసా దొరికిందని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ అద్భుతంగా ఉందన్నారు.

చిన్న చిన్న సమస్యలను ధరణి పోర్టల్ అధిగమించిందని కేసీఆర్ తెలిపారు. 3, 4రోజుల్లో ధరణి పోర్టల్ అన్ని రకాల సమస్యలను అధిగమిస్తోందని పేర్కొన్నారు.

Related Tags :

Related Posts :