లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

సీరియల్ రేపిస్ట్‌కు 897 ఏళ్ల జైలుశిక్ష..30ఏళ్లుగా న్యాయం కోసం ఎదురుచూసిన బాధితులు

Published

on

North California rapist Roy Waller sentenced to 897 years in prison : ఎంతోమంది మహిళలపై అత్యాచారాలకు తెగబడి దారుణ నేరాలకు పాల్పడిన కరడుకట్టిన రేపిస్టుకు కోర్టు ఎట్టకేలకు 897 ఏళ్ల జైలుశిక్ష విధించింది. 15 సంవత్సరాలకుపైగా ప్రజలకు తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తు మహిళలపై మానభంగాలు..దోపిడీలు చేసిన కరడుకట్టిన నేరస్థుడికి దాదాపు 30ఏళ్లకు న్యాయస్థానం 897 సంవత్సరాల జైలుశిక్షను విధించింది. అన్ని ఏళ్ల శిక్ష అంటే అతను అన్ని ఏళ్లు జీవిస్తాడని కాదు..ఆ నేరస్థుడు చేసిన నేరాల తీవ్రను బట్టి కోర్టు అన్నేళ్ల శిక్షను విధించింది. దీంతో ప్రస్తుతం వాలర్ వయస్సు 60 ఏళ్లు కాగా..ఇక తన మిగిలిన జీవితం జైలు గోడల మధ్యే గడపనున్నాడు.

నార్త్ కాలిఫోర్నియాలో చార్లెస్ వాలర్ అనే వ్యక్తి పలు రేప్ కేసులు, దోపిడీల కేసులో అతన్ని దోషిగా తేల్చిన న్యాయస్థానం ఈ శిక్ష విధించిందని శాక్రమెంటో కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం తెలిపింది.

రాయ్ చార్లెస్ వాలర్ అనే వ్యక్తి 1991 నుంచి 2006 మధ్య కాలంలో తొమ్మది మహిళలపై వరుస దాడులకు తెగబడ్డాడు. వారిని కిడ్నాప్, అత్యాచారాలు చేసేవాడు. అత్యాచారాలు కనిపించినవారినల్లా దోపిడీలు చేస్తు ప్రజలకు భయభ్రాంతులకు గురిచేసేవాడు రాయ్ చార్లెస్. చార్లెస్ ను ఇటువంటి మొత్తం 46 కేసుల్లో దోషిగా తేల్చింది శాక్రమెంటో జ్యూరీ.

ఉత్తర కాలిఫోర్నియాలోని ఆరు కౌంటీలలో రాయ్ చార్లెస్ వాలర్ దాడులకు పాల్పడ్డాడు. కరడుకట్టిన నేరస్థుడిగా తయారై పోలీసులకే సవాళ్లు విసురుతూ పలు ఇళ్లలోకి ప్రవేశించి.. ఆ ఇంటిలోవారిని బంధించి లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. కొన్ని సందర్భాల్లో వారిని కిడ్నాప్ చేసే సిటీ శివారుల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు. రాత్రి అయ్యిందంటే చాలు ఎవరి ఇళ్లల్లో ఇటువంటి దారుణాలు జరుగుతాయోనని ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బ్రతికే పరిస్థితికి తీసుకెళ్లేవాడు వాలర్.

కొన్ని సందర్భాల్లో మహిళలను కిడ్నాప్ చేసిన వాలర్.. వారిని ఏటీఎంల వద్దకు లాక్కెళ్లి వారితోనే డబ్బులు డ్రా చేయించి వాటిని దోచుకుని వారిని కట్టేసి అక్కడే పాడేసిపోయేవాడు. ఆ డబ్బులతో జల్సాలు చేసేవాడు. పలు ఇళ్లలో అతను చేసిన చోరీలకు లెక్కేలేదు.

ఇన్ని నేరాలు చేస్తున్నా వాలర్ ను పోలీసులు పట్టుకోలేకపోయేవారు. అంత కిలాడీ వాలర్. ఇన్ని నేరాలు చేసినా ఒక్కసారి కూడా పోలీసులకు చిక్కకపోవటంతో వాలర్ పై పోలీసులు దృష్టి పడలేదు. కారణం అతను పోలీసుల వద్ద ఉండే నేరస్థుల డీఎన్‌ఏ డేటా బేస్‌లో వాలర్ డీఎన్‌ఏ లేకపోవడమే.

కానీ వాలర్ చేతిలో లైంగిక దాడికి గురైన ఓ మహిళ ఇంట్లో లభించిన జీవసంబంధి ఆధారాల ద్వారా ప్రత్యేకమైన డీఎన్‌ఏ ప్రొఫైల్ సిద్ధం చేసి వాలర్ ను 2108 సెప్టెంబర్ వాలర్ కు సంబంధించిన ఓ కీలక ఆధారం అధికారులకు లభించింది. ప్రత్యేక డీఎన్‌ఏ ప్రొఫైల్ ఆధారంగా అత్యాధునిక జన్యు వంశవృక్షాన్ని ఉపయోగించిన పరిశోధకులు.. నేరస్తుడి సంబంధింత బంధువుల లిస్టును తయారు చేసి దాని ఆధారంగా వాలర్ ను గుర్తించారు. దీని ద్వారా అధికారులు వాలర్‌ను పట్టుకోవటం జరిగింది. బర్కిలీలోని వాలర్ ఉద్యోగం చేస్తున్న ప్రదేశం నుంచి అతన్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

అతనిని అన్ని కోణాల్లోని విచారించగా అతను చేసిన నేరాలను రుజువు చేశారు. అలా శుక్రవారం (డిసెంబర్ 18,2020) న్యాయస్థానంలో ఈ కేసు విచారించిన సందర్భంగా.. అధికారులు తొమ్మిది మంది బాధిత మహిళలు, ఫోరెన్సిక్ నిపుణులు.. తమ తమ సాక్ష్యాలను సమర్పించడానికి పలు రాష్ట్రాల నుంచి శాక్రమెంటోకు వెళ్లారు. ఈకేసు విచారణలో రిటైర్ అయిన అధికారులు కూడా పాల్గొన్నారు.

ఈ కేసులో బాధితులు న్యాయం కోసం దశాబ్దాలుగా అంటే దాదాపు 30ఏళ్లుగా ఎదురుచూశారు. వారి ఎదురు చూపులకు ఈనాటికి న్యాయం లభించింది. కాగా ఈ కేసులో వాలర్ తరఫు న్యాయవాది జో ఫరీనా మాట్లాడుతూ.. నా క్లైంట్ వాలర్ తానను తాను దోషిగా భావించడం లేదనీ కాబట్టి..కోర్టు ఇచ్చిన ఈ తీర్పును అప్పీల్ చేసేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు.