దక్షిణ కొరియా అధికారి హత్య…క్షమాపణలు కోరిన కిమ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ క్షమాపణ కోరాడు . కిమ్ క్షమాపణ చెప్పడమేమిటని అనకుంటున్నారా..మీరు విన్నది నిజమే. సముద్రతీరంలో దక్షిణ కొరియా అధికారిని కాల్చిచంపడం పట్ల కిమ్వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పారని సియోల్‌ లోని అధ్యక్ష కార్యాలయం తెలిపింది.


అసలేం జరిగింది

ఉత్తర-దక్షిణ కొరియా సరిహద్దుల్లో గస్తీ కాస్తున్నఓ ఫిషరీస్ అధికారి కనిపించకుండా పోయాడు. కనిపించకుండా పోయిన అధికారి ఉన్న ప్రాంతానికి గ్యాస్ మాస్క్‌లు ధరించిన ఉత్తర కొరియా అధికారులు చేరుకున్నారు. అక్కడికి ఎందుకు వచ్చామని అతనిని ప్రశ్నించారు.. ఆ తర్వాత కొద్దిసేపటికే అతనిని కాల్చి చంపి, శరీరంపై నూనె పోసి తగలబెట్టి,సముద్రంలో పడేసినట్టుగా దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరుదేశాల మధ్య ఉన్న వివాదాస్ప‌ద స‌ముద్ర జ‌లాల బోర్డ‌ర్ ప‌రిధిలో నీటిలో తేలుతున్న చిన్న‌ప‌డ‌వ‌పై కాల్చేసిన త‌మ అధికారి శ‌వం ఉన్న‌ట్టు గుర్తించామని దక్షిణ కొరియా తెలిపింది.


అయితే కరోనా భయంతోనే ఉత్తర కొరియా బలగాలు ఈ హత్య చేసి ఉండవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. కాగా, ఉత్తర కొరియా దళాలు దక్షిణ కొరియా పౌరుడిని చంపడం దశాబ్ధ కాలం తర్వాత ఇదే తొలి ఘటన కావడంతో దక్షిణ కొరియాలో ఆగ్రహం పెల్లుబుకుతోంది.


అయితే,కరోనా వైరస్‌తో దక్షిణ కొరియా సమస్యల్లో కూరుకుపోయిన క్రమంలో సాయం చేయాల్సిన తరుణంలో అధ్యక్షుడు మూన్‌, దక్షిణ కొరియన్లను బాధపెట్టినందుకు కిమ్‌ క్షమాపణలు చెప్పారని దక్షిణ కొరియా జాతీయ భద్రతా సలహాదారు సు హున్‌ తెలిపారు.

Related Posts