రూ.2వేల నోటుపై RBI కీలకమైన మెసేజ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

డీ మానిటైజేషన్ తర్వాత వచ్చిన నోట్లలో రూ.2వేల నోటే పెద్దది. ప్రస్తుత మార్కెట్లో దీని చెలామణి కూడా అనుమానస్పదంగానే ఉంది. ఈ నోట్ల కొరత చూసి కొందరైతే త్వరలోనే రూ.2వేల నోట్లు రద్దు చేస్తారంటూ పుకార్లు కూడా పుట్టిస్తున్నారు. వీటన్నిటికీ క్లారిఫై ఇస్తూ.. ఆర్బీఐ సంచలన ప్రకటన చేసింది. గత ఆర్థిక సంవత్సరం 2019-20లో ఒక్క రూ. 2వేల నోటు కూడా ముద్రించలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మంగళవారం వెల్లడించింది.

2018 నుంచి ఈ నోట్ల చెలామణి క్రమంగా తగ్గిందని సెంట్రల్ బ్యాంక్ తన యాన్యువల్ రిపోర్ట్‌లో పేర్కొంది. మరోవైపు 2018 నుంచి మూడేళ్లుగా 500, 200 రూపాయల నోట్ల చెలామణి గణనీయంగా పెరిగినట్టు ఆర్‌బీఐ తెలిపింది. చెలామణిలో ఉన్న 2 వేల విలువైన కరెన్సీ నోట్ల సంఖ్య 2018 మార్చి చివరి నాటికి 33వేల 632 లక్షలు ఉండగా, 2019 మార్చి చివరినాటికి 32వేల 910 లక్షలకు పడిపోయింది.

2020 మార్చి ఆఖరికి 27వేల 398 లక్షల నోట్లకు పడిపోయిందని ఆర్‌బీఐ రిపోర్ట్ డిక్లేర్ చేసింది. 2020 మార్చి చివరి నాటికి మొత్తం నోట్ల వాల్యూమ్‌లో 2.4 శాతం 2,000 డినామినేషన్ నోట్లు ఉన్నాయని, ఇది 2019 మార్చి చివరినాటికి 3 శాతం, 2018 మార్చి నాటికి 3.3 శాతం తగ్గిందని నివేదిక పేర్కొంది. 2020 మార్చి చివరి నాటికి 22.6 శాతానికి పడిపోయింది,

కొవిడ్-19 మహమ్మారి నోట్ల సరఫరాపై ఎఫెక్ట్ చూపించిందని ఆర్‌బీఐ కన్ఫామ్ చేసింది. ప్రధానంగా కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ కారణంగా 2019-20లో నోట్ల సరఫరా కూడా మునుపటి సంవత్సరంతో పోలిస్తే 23.3 శాతం తగ్గింది. నకిలీ నోట్ల విషయానికొస్తే, గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2లక్షల 96వేల 695 నోట్లను గుర్తించారు. వాటిలో 17వేల 20 రూ.2 వేల నోట్లు ఉన్నాయి.

Related Posts