కరోనా నుంచి కోలుకున్నవారంతా ఇప్పుడు వినికిడి కోల్పోతున్నారు.. వైద్యుల హెచ్చరిక

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వైరస్ సోకినవారిలో కొత్త అనారోగ్య సమస్యలు పుట్టకొస్తున్నాయి. కరోనా మహమ్మారి బారినుంచి ప్రాణాలతో బయటపడ్డామలే అనుకున్న వారిలో తీవ్ర అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారిలో కొత్తగా వినికిడి లోపం కనిపిస్తుందంట.. చాలామందిలో వినికిడి కోల్పోయినట్టు గుర్తించారు.

అంతేకాదు.. వాసన, రుచిని కోల్పవడం వంటి సమస్యలు అధికమవు తున్నాయని అంటున్నారు. మాంచెస్టర్ యూనివర్శిటీ నిపుణులు వైరస్ నుంచి కోలుకున్న వ్యక్తులు వినికిడి క్షీణతతో పాటు టిన్నిటస్ వంటి అనారోగ్య సమస్యలను గుర్తించామని నివేదించారు.కోవిడ్ -19 నుంచి కోలుకున్న తర్వాత పదిమందిలో ఒకరు తమ రుచి లేదా వాసనను శాశ్వతంగా కోల్పోతారని ఇటాలియన్ రోగుల పరిశోధన వెల్లడించిన కొద్ది రోజుల్లోనే ఈ కొత్త సమస్య వెలుగులోకి వచ్చింది. వైరస్ ప్రభావంతో ప్రజలు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను అనుభవించవచ్చని పరిశోధకులు హెచ్చరించారు. ‘లాంగ్ కోవిడ్’గా పిలిచే స్థితిలో రోగులు నెలల తరబడి దుష్ప్రభావాలతో బాధపడతారని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మాంచెస్టర్ యూనివర్శిటీలోని ఆడియాలజిస్టుల అభిప్రాయం ప్రకారం.. వైరస్ నుంచి కోలుకునేవారికి కూడా వినికిడి సమస్యలు తలెత్తవచ్చునని అన్నారు.

NIHR మాంచెస్టర్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ (BRC)సహకారంతో ఈ అధ్యయనం వైథెన్‌షావ్ ఆస్పత్రిలో చేరిన 121 మందిపై సర్వే చేసింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 8 వారాల తర్వాత వారిని ఫోన్‌ ద్వారా పలు అంశాలపై ప్రశ్నించారు. మీలో ఎవరికైనా వినికిడిలో ఏమైనా మార్పులు ఎదురయ్యాయా అని అడిగినప్పుడు 13.2 శాతం మంది వినికిడి కోల్పోయామని చెప్పారు. 8 మంది వారి వినికిడి కోల్పోయినట్టు చెప్పగా.. మరో 8 మంది tinnitusను నివేదించారు.వీరిలో చాలావరకు బయటి నుంచి శబ్దాలు వినే అవకాశంఉందన్నారు. International Journal of Audiologyకి రాసిన లేఖలో అధ్యయనం ఫలితాల్లో ఈ విషయాన్ని పరిశోధకులు వెల్లడించారు.మాంచెస్టర్ యూనివర్శిటీ, NIHR మాంచెస్టర్ BRC హియరింగ్ హెల్త్ థీమ్ లీడ్‌లోని ఆడియాలజీ ప్రొఫెసర్ ప్రొఫెసర్ కెవిన్ మున్రో చెబుతున్న ప్రకారం.. ‘మీజిల్స్, గవదబిళ్ళలు, మెనింజైటిస్ వంటి వైరస్‌ల కారణంగా వినికిడి కోల్పోయే ప్రమాదం ఉందని, మెదడు నుంచి నరాలను దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నారు.

కోవిడ్ -19 వైరస్ కారణంగా చెవి లేదా కోక్లియాతో సహా వినికిడి వ్యవస్థ భాగాల్లో సమస్యలను కలిగించే అవకాశం ఉంది. అడిటరీ న్యూరోపతి, కోక్లియా చెప్పిన ప్రకారం.. నాడి వెంట మెదడుకు ప్రసారం బలహీనంగా మారుతుందని తెలిపారు. అడిటరీ న్యూరోపతి సమస్యలతో బాధపడేవారిలోనూ వినికిడి సమస్యలు వస్తాయి.పబ్‌లో లేదా సూపర్‌మార్కెట్‌లో ప్రభావితమైన వారు ఇతర శబ్దాలు వినిపించినట్టుయితే వారికి తిరిగి సమాధానం చెప్పడం కష్టమే.. ఎందుకుంటే ఇతరులు ఎవరూ మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి. ఈయన Guillain-Barre సిండ్రోమ్ అడిటరీ న్యూరోపతితో ముడిపడి ఉందని ఆయన అంటున్నారు. ఇది SARS CoV-2 తో అనుబంధాన్ని కలిగి ఉందని అంటున్నారు.

READ  కరోనా నుంచి కోలుకున్న తబ్లిగీల కీలక నిర్ణయం, వారి కోసం ప్లాస్మా దానం

వైరస్, వినికిడి సమస్యలను ఎదుర్కొనే రోగుల మధ్య పరస్పర అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, లేదంటే ఎక్కుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని పరిశోధకులు తెలిపారు. కరోనా వైరస్ తో పాటు ఇతర అనారోగ్య పరిస్థితులు ఆందోళనకరంగా ఉండొచ్చు. ఫేస్ మాస్క్ ధరించడం, కోవిడ్-19 ట్రీట్ మెంట్ వినియోగించే మందులు, చెవికి హని కలిగించే లేదా ఒత్తిడి వంటి తీవ్రమన అనారోగ్య సమస్యలు ఉంటాయని హెచ్చరించారు.

Related Posts