Updated On - 10:32 am, Wed, 20 January 21
drunk co-passengers to be booked : మద్యం తాగిన వ్యక్తితో మీరూ తాగి జర్నీ చేస్తున్నారా ? అయితే ఒక్కసారి ఆలోచించుకోండి. రోడ్డు ప్రమాదం జరిగితే..పోలీసులు తనిఖీలు చేస్తే..మీరు బుక్కవుతారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని, మద్యం సేవించి డ్రైవ్ చేస్తున్నా..అతడితో పాటు ప్రయాణించే వ్యక్తిపై కూడా క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా చేరుస్తున్నామని సైబరాబాద్ పోలీసు విభాగాధికారి వెల్లడించారు. ఇన్ని రోజులు..మద్యం మత్తులో వాహనం నడిపి..ప్రమాదానికి కారకుడైన డ్రైవర్ పైనే కేసులు నమోదు చేసేవారు. రోడ్డు ప్రమాదాలను నియత్రించాలనే ఉద్దేశ్యంతో డ్రంకన్ డ్రైవర్ తో పాటు..అతడి పక్కనే కూర్చొన్న మద్యం తాగిన వ్యక్తిపై 304 పార్ట్ టూ రెడ్ విత్ 109 ఐపీసీ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నారు.
గత సంవత్సరం సైబరాబాద్ పరిధిలో 144 రోడ్డు ప్రమాదాలు డ్రంకెన్ డ్రైవ్ వల్ల జరిగితే..153 మంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు వాహనచోదకులు, మరికొందరు ఎదుటి వాహనాల వాళ్లు, పాదాచారులు..ఏమాత్రం సంబంధం లేని వారు చనిపోయారు. దీంతో పోలీసులు ప్రత్యేకంగా దీనిపై దృష్టి కేంద్రీకరించారు. ఇటీవలే…మద్యం తాగిన మత్తులో ఎస్ యూవీ కారు నడుపుకుంటూ..వచ్చిన కాశీ విశ్వనాథ్…సికింద్రాబాద్ క్లబ్ మేనేజర్ గౌతమ్ దేవ్ గాడాయ్, ఆయన భార్య శ్రావణి శ్వేతలు మాదాపూర్ లో బైక్ ను ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గౌతమ్ చనిపోగా..శ్వేతకు తీవ్రగాయాలయ్యాయి. వాహనం నడుపుతున్న వ్యక్తితో పాటు అతడిపక్కనే కూర్చొన్న వ్యక్తికి బ్రీత్ అనలైజర్ టెస్టులు చేయడంతో మద్యం తాగినట్లుగా తేలింది. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సైబరాబాద్ పోలీసులు ఇద్దరిపై క్రిమినల్ కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.
స్కూల్ కెళ్లి చదువుకోమన్నారని బాలుడు ఆత్మహత్య
శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు చంద్రబాబు కుట్ర
ఉల్లిగడ్డల చోరీకి వచ్చాడనే అనుమానంతో వ్యక్తిని కొట్టి చంపిన రైతులు, కర్నూలు జిల్లాలో విషాదం
విద్యార్థినులకు నీలిచిత్రాలు చూపించిన టీచర్, క్లాస్‌రూమ్‌లో గలీజు పని
హైదరాబాద్ ఘట్కేసర్లో యువతుల దందా, స్వచ్చంద సంస్థ పేరుతో వసూళ్లు
పోలీసులతో చంద్రబాబు వాగ్వాదం.. ఎయిర్‌పోర్ట్‌లో నేలపై కూర్చొని నిరసన!