లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Business

20% క్యాష్ బ్యాక్ : అమెజాన్‌లో Movie Tickets బుకింగ్ చేయండిలా

Published

on

Now you can book movie tickets on Amazon India

ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాలో మూవీ టికెట్లు కూడా బుకింగ్ చేసుకోవచ్చు. మీ ఫోన్లలో అమెజాన్ మొబైల్ యాప్ ఉంటే చాలు.. ఈజీగా ఆన్‌లైన్లో మూవీ టికెట్లను బుకింగ్ చేసుకోనే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకూ మూవీ టికెట్లు బుకింగ్ చేసుకోవాలంటే థర్డ్ పార్టీ వెబ్ సైట్లపై ఆధారపడాల్సి వస్తోంది.

ఇక నుంచి అమెజాన్‌లో కూడా మూవీ టికెట్లు బుకింగ్ విధానం అమల్లోకి వచ్చింది. 2019 ఏడాది ఆరంభంలోనే అమెజాన్ ఇండియా.. ఫ్లయిట్ బుకింగ్ ఫీచర్ లాంచ్ చేసింది.ఈ ఫీచర్ ద్వారా ఇండియాలోని మొబైల్ యాప్ యూజర్లు ఈజీగా విమానం టికెట్లను బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.

ఆరు నెలల తర్వాత ఇప్పుడు బ్రాండ్ న్యూ ఫీచర్ ప్రవేశపెట్టింది. దీని ద్వారా దేశంలోని అమెజాన్ యూజర్లు ఈజీగా తమ అమెజాన్ మొబైల్ యాప్ నుంచి మూవీ టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్.. అమెజాన్ మొబైల్ యాప్ (ఆండ్రాయిడ్, iOS బేసిడ్ యాప్స్)పై మాత్రమే అందుబాటులో ఉంది. కానీ, అమెజాన్ డెస్క్ టాప్ బేసిడ్ వెబ్‌సైట్ ప్లాట్‌ఫాంపై మాత్రం ఈ ఫీచర్ పనిచేయదు.

అమెజాన్ కొత్త ఫీచర్ ద్వారా మూవీ టికెట్లు బుకింగ్ చేసుకునే యూజర్లకు క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. మూవీ టికెట్లపై రూ.200ల వరకు 20శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ నవంబర్ 1,2019 నుంచి నవంబర్ 14, 2019 వరకు మాత్రమే వ్యాలీడ్ ఉంటుంది.

మూవీ టికెట్లపై వచ్చిన క్యాష్ బ్యాక్.. అమెజాన్ యూజర్ల అకౌంట్లలోని Amazon Pay బ్యాలెన్స్ లో 3 రోజుల్లోగా క్రెడిట్ అవుతుంది. అమెజాన్ ఇండియా Book MyShow భాగస్వామ్యంతో ఈ ఫీచర్ ద్వారా ఆఫర్ చేస్తోంది. అమెజాన్ మొబైల్ యాప్ నుంచి మూవీ టికెట్లను ఎలా బుకింగ్ చేసుకోవాలో ప్రాసెస్ ఓసారి చూద్దాం.

బుకింగ్ చేసుకునే ప్రాసెస్ ఇదిగో :
* అమెజాన్ మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
* ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్.. iOS యూజర్లు APP స్టోర్ వెళ్లండి.
* మీ ఫోన్లలో App ఇన్ స్టాల్ చేసుకోని ఓపెన్ చేయండి.
* కొత్త ఫీచర్ కోసం.. Amazon Pay సెక్షన్ tap చేయండి.
* Scroll Down చేసి Book Movie Ticketsపై క్లిక్ చేయండి.
* అమెజాన్ యాప్‌లో Continue Booking ఆప్షన్‌పై Tap చేయండి. 
* ఇప్పుడు ఒక Page ఓపెన్ అవుతుంది. City ఎంపిక చేసుకోండి.
* పేజీలో In Cinemas, Coming Soon అనే రెండు సెక్షన్లు కనిపిస్తాయి.
* అందులో ఒక్కో సెక్షన్లో మూవీ లిస్టు కనిపిస్తుంది. 
* చూడాలనుకునే Movie Booking బటన్ పై క్లిక్ చేయండి.
* మూవీకి సంబంధించిన అన్ని వివరాలతో Book Now కనిపిస్తుంది.
* మూవీ సెక్షన్‌లో Search tab ఉంటుంది.
* ఈ ట్యాబ్ పై సినిమా హాల్ లేదా మూవీ గురించి సెర్చ్ చేయొచ్చు.
* ఇక్కడ Date, Cinema Hall సెలెక్ట్ చేసుకోండి.
* Payment ఆప్షన్ కూడా ఎంపిక చేసుకోండి.
* పేమెంట్ చేసి మూవీ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *