లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime News

భార్య..కొడుకు..పెంపుడు కుక్కని చంపేసి ఇంట్లోనే కుళ్లబెట్టాడు..తరువాత…

Published

on

nri man:బంగారంలాంటి భార్యను..ముద్దు ముద్దు మాటలు చెప్పే ఏడాదిలోపు వయస్సున్న కొడుకును..ప్రాణంగా పెంచుకునే పెంపుడు కుక్కను అత్యంత పాశవికంగా చంపేశాడు ఓ ఓ భర్త. తరువాత తానుకూడా పొడుచుకుని చనిపోయాడు. భార్యాబిడ్డలను..ఆఖరికి పెంపుడు కుక్కను కూడా ఎందుకు చంపాడో తెలీదు.


తమిళనాడకు చెందిన కుహరాజ్ సీతమ్ పరమనాథన్ అనే 42 ఏళ్ల వ్యక్తి లండన్ లోని బ్రెంట్‌ఫోర్డ్ సెటిల్ అయ్యాడు. ఏం జరిగిందో ఏమోగానీ..ఓ రోజు పరమనాథన్ తన భార్య పూర్ణ కామేశ్వరిని, మూడేళ్ల కొడుకు కైలాస్‌ను, పెంపుడు కుక్కను రెండు వారాల కిందట చంపేశాడు. తర్వాత వారి మృతదేహాలను ఇంట్లోనే ఉంచాడు.


ఈ క్రమంలో గత ఆదివారం (అక్టోబర్ 4,2020)న కుహరాజ్ కు ఫోన్ చేస్తే ఎటువంటి స్పందనా లేదని..ఎన్ని సార్లు చేసినా అదే పరిస్థితి ఉందని కనీసం ల్యాండ్ ఫోన్ కూడా ఎవ్వరూ లిఫ్ట్ చేయటంలేదని..దయచేసి ఏమైందో కనుక్కోవాలని కుహరాజ్ తరపు బంధువుల నుంచి పోలీసులకు ఫోన్ వచ్చింది. దీంతో పోలీసులు కుహరాజ్ నివసిస్తున్న అపార్ట్ మెంట్ ఫోర్త్ ఫోర్ కి వచ్చారు. తలుపులు కొట్టినా ఎవ్వరూ తీయలేదు.దీంతో అనుమానం వచ్చిన పోలీసులు డోర్స్ బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా..కుహరాజ్ నెత్తురోడుతూ హాల్లో కనిపించాడు. ఇల్లు దుర్వాసన వస్తోంది. అతన్ని ఆ పరిస్థితిలో చూసిన పోలీసులు వెంటనే హాస్పిటల్ తరలిందామని..ఈలోపుగా కాస్త ఫస్ట్ ఎయిడ్ చేద్దామని యత్నిస్తుండగా..చనిపోయాడు.


ఇంట్లో ఇంకెవరైనా కుటుంబ సభ్యులు ఉన్నారా? అని పోలీసులు ఇల్లు గాలిస్తుండగా..కామేశ్వరి, కైలాస్, పెంపుడు కుక్క మృతదేహాలు కుళ్లిపోతున్న స్థితిలో కనిపించాయి. ఈ దారుణ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు గత సెప్టెంబర్ 21న కుహరాజ్ భార్యను, కొడుకుతో పాటు పెంపుడు కుక్కను కూడా చంపేశాడని..ఆదివారం తనను తాను పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు.


కుహరాజ్ కుటుంబం గురించి చుట్టు పక్కలవారిని ఎంక్వయిరీ చేయగా..కుహరాజ్ తన భార్యతో గొడవపడేవాడని ఇరుగుపొరుగు వారు చెప్పారు. మలేసియా తమిళులైన కుహరాజ్, కామేశ్వరి 2015లో కౌలాలంపూర్‌లో పెళ్లి చేసుకున్నారని వారు తెలిపారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *