సోషల్ మీడియాను షేక్ చేస్తామంటున్న ప్రభాస్, తారక్ ఫ్యాన్స్!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Prabhas – NTR: రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ.. ‘‘RRR – రౌద్రం రణం రుధిరం’’.. షూటింగ్ దాదాపు ఏడు నెలల తర్వాత తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా మేకింగ్ వీడియోతో పాటు అక్టోబర్ 22న తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన వీడియో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.


అలాగే అక్టోబర్ 23 డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘రాధే శ్యామ్’ ఫస్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారు. దీంతో ఎంతోకాలంగా ఈ సినిమా అప్‌డేట్ కోసం ఎదురుచూస్తూ.. యూవీ క్రియేషన్స్ నిర్మాతలపై కోపంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త శాంతించారు. అలాగే రెబల్‌స్టార్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ ‘ఆదిపురుష్’ సినిమాకు సంబంధించి వరుస అప్‌డేట్స్‌‌తో దంచి కొడుతున్నారు. ఆగస్ట్‌లో సినిమా ఎనౌన్స్ చేస్తే, సెప్టెంబర్‌లో విలన్ ఎవరనేది రివీల్ చేశారు. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా హీరోయిన్‌ను ప్రకటించబోతున్నారని తెలుస్తోంది.

NTR-Prabhas

అలాగే ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వైజయంతీ సంస్థ నిర్మిస్తున్న పాన్ వరల్డ్ మూవీకి సంబంధించిన అప్‌డేట్ అయితే పక్కాగా ఉంటుంది.
తారక్ ఆర్ఆర్ఆర్, ప్రభాస్ మూడు సినిమాలు అందులోనూ పాన్ ఇండియా మూవీస్ అప్‌డేట్లతో సోషల్ మీడియాలో సందడి చేయడానికి అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇటు డార్లింగ్ ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు.


తమ హీరోల సినిమాల తాలుకూ అప్‌డేట్లకు సంబంధించి రికార్డ్ స్థాయి వ్యూస్ అండ్ లైక్స్‌తో సందడి చేయడానికి సోషల్ మీడియాను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. సాధారణంగా ట్విట్టర్‌లో హీరోల ఫ్యాన్స్ మధ్య వార్స్ ఏ స్థాయిలో జరుగుతాయో తెలిసిందే. ఇక 24 గంటలలోపు ఇద్దరు బిగ్ స్టార్స్ అప్‌డేట్స్ అంటే రచ్చ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

Radhey Shyam

Related Posts