NTR Kathanayakudu Movie Review

మూవీ రివ్యూ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

నందమూరి బాలకృష్ణ, తన తండ్రి చేసిన వెండితెర పాత్రల్లోనూ, నిజ జీవిత పాత్రలోనూ ఒదిగిపోయాడు.

నటసింహ నందమూరి బాలకృష్ణ, తన తండ్రి, స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత కథకి వెండితెర రూపమిస్తూ, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు పేర్లతో రెండు పార్ట్లుగా తెరకెక్కించగా, ఫస్ట్ పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా, భారీ అంచనాల మధ్య, ఈరోజు (జనవరి 9) గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది.
మరి, కథానాయకుడు ఆ అంచనాలను అందుకున్నాడా, లేదా అనేది ఇప్పుడు చూద్దాం.
కథ :

నందమూరి తారక రామారావు (బాలకృష్ణ)కి నాటకాలన్నా, సినిమాలన్నా ఎంతో ఇష్టం. తను చేస్తున్న ఉద్యోగం నచ్చక, రాజీనామా చేసి, సినిమాల్లో అవకాశాల కోసం మద్రాసు వెళ్తాడు. అక్కడ కొన్ని సినిమా కష్టాలు పడ్డతర్వాత, సినిమా అవకాశాలు వస్తాయి. విజయా బ్యానర్ వారు అతనితో కొన్ని సినిమాలకు అగ్రిమెంట్ కూడా చేసుకుంటారు. నాగిరెడ్డి, చక్రపాణి, కె.వి.రెడ్డి వంటి వారు రామారావు సినీ కెరీర్‌కి దిశానిర్దేశం చేస్తుంటారు. నటుడిగా బిజీ అయ్యాక, భార్య, పిల్లలని మద్రాసు తెచ్చేసుకుంటాడు రామారావు. రాయలసీమ ప్రజలు కరువుతో అల్లాడుతున్నారని తెలిసి, తనే స్వయంగా జోలె పట్టుకుని విరాళాలు పోగు చేసి, వారికి సాయ పడతాడు. మరోసారి కృష్ణాజిల్లాలోని దివిసీమలో తుఫాను బాధితులకు, సహనటుడు అక్కినేని నాగేశ్వరరావు(సుమంత్)తో కలిసి విరాళాలు పోగు చేసి, వారిని ఆదుకుంటాడు. అలాంటి టైమ్‌లో మద్రాసులో రాజకీయంగా క్లిష్టపరిస్థితి నెలకొంటుంది. ఆ పరిస్థితులు, ప్రజల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూసి, నెత్తురు మండిపోయి, ప్రజా సేవకే అంకితమవ్వాలని నిర్ణయించుకుంటాడు రామారావు. ఆయన రాజకీయాల్లోకి వస్తాడనే వార్త విన్న ప్రజలు, వేలాది ఉత్తరాల ద్వారా తమ సమస్యలు ఆయనకి చెప్పుకుంటారు. అదే టైమ్‌లో తన స్నేహితుడు, క్లాస్ మేట్ అయిన భవనం వెంకటరామి రెడ్డి (నాజర్)ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్ళిన రామారావుకి, నాదెండ్ల భాస్కరరావు(సచిన్ కేద్‌కర్) పరిచయం అవుతాడు. రోజురోజుకీ రామారావు రాజకీయ ప్రవేశం గురించి వార్తలు వస్తుండగా, ఒకానొక రోజు రామారావు జనసమూహం మధ్య తాను పార్టీ పెట్టబోతున్నాననీ, ఆ పార్టీ పేరు తెలుగుదేశం అని ప్రకటించడంతో, కథానాయకుడు ముగుస్తుంది.

 

నటీనటులు, సాంకేతిక నిపుణులు :

నందమూరి బాలకృష్ణ, తన తండ్రి చేసిన వెండితెర పాత్రల్లోనూ, నిజ జీవిత పాత్రలోనూ ఒదిగిపోయాడు. క్యారెక్టర్‌కీ, క్యారెక్టర్‌కీ ఆయన నటన, బాడీ లాంగ్వేజ్‌లో చూపిన వైవిధ్యం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, తన నటనతో కథనాయకుడిని రక్తి కట్టించాడు బాలయ్య. విద్యాబాలన్, బసవ తారకం పాత్రలో అద్భుతంగా నటించింది. భర్తే సర్వసం అని నమ్మే సాధారణ గృహిణిగా, భర్తని అన్నివేళలా కంటికి రెప్పలా కాపాడుకునే ఇష్టసఖిగా ఆమె చాలా సహజంగా నటించింది. ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావుగా దగ్గుబాటి రాజా, బావమరిదిగా వెన్నెలకిషోర్, కె.వి.రెడ్డిగా, దర్శకుడు క్రిష్, చక్రపాణిగా మురళీశర్మ, నాగిరెడ్డిగా ప్రకాష్ రాజ్, ఎన్టీఆర్ పర్సనల్ మేకప్ మెన్ పీతాంబరంగా రైటర్ సాయి మాధవ్ బుర్రా, దాసరిగా దర్శకుడు చంద్రసిద్ధార్థ, నందమూరి హరికృష్ణగా కళ్యాణ్ రామ్,  చంద్రబాబుగా రానా తదితరులు నటించారు.

READ  బాలయ్య అల్లుడికి షాక్..ఆస్తుల జప్తునకు బ్యాంకు నోటీసులు

వి.ఎస్.జ్ఞానశేఖర్ కెమెరా వర్క్, ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు. ప్రతీ ఫ్రేమ్‌ని అద్భుతంగా సెట్ చేసాడు. ఆర్ట్ డైరెక్టర్ వేసిన సెట్స్ చక్కగా సెట్ అయ్యాయి. ఎమ్.ఎమ్.కీరవాణి పాటలతో పాటు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా ఇచ్చాడు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగానే ఉన్నాయి. డైరెక్టర్ క్రిష్, ఈ సినిమాని తీసిన విధానం, ఎన్టీఆర్ చరిత్రని కథగా ఎంతవరకు, ఎలా చెప్పాలో అలానే చెప్పాడు. ఫస్ట్ హాఫ్ అంతా సినిమాల గురించి చూపించి, సెకండ్ హాఫ్‌ని ఎమోషనల్‌గా, హార్ట్ టచ్చింగ్‌గా రూపొందించి, ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు.
చివరిగా, ఎన్టీఆర్ కథానాయకుడు.. తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తాడు.  

వాచ్ ట్రైలర్…
 

Related Posts