యంగ్ టైగర్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌కు 10 ఏళ్లు..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

NTR’s Brindavanam: ఈ జనరేషన్ కథానాయకుల్లో తిరుగులేని మాస్ ఇమేజ్ కలిగిన యంగ్ టైగర్ NTR ను సరికొత్త యాంగిల్‌లో ప్రజెంట్ చేస్తూ.. సమంత, కాజల్ కథానాయికలుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన లవ్, ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్‌టైనర్.. ‘బృందావనం’.. 14 అక్టోబర్ 2010 న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం నేటితో (14 అక్టోబర్ 2020) పదేళ్లు పూర్తి చేసుకుంటోంది.


ఈ సందర్భంగా ఒక్కసారి ‘బృందావనం’ చిత్ర విశేషాలు..
అప్పటి వరకు వరుసగా మాస్, యాక్షన్ సినిమాలు చేస్తూ వచ్చిన తారక్.. ఇలాంటి ఫ్యామిలీ కథ ఒప్పుకోవడం ఏంటని అనుకున్నవాళ్లు లేకపోలేదు. కట్ చేస్తే ఎన్టీఆర్ పోస్టర్ రిలీజ్ చేశాక అరే తారక్ కొత్త గెటప్‌లో భలే ఉన్నాడే అంటూ ఆశ్చర్యపోయారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ కంపోజ్ చేసిన పాటలు విడుదలకు ముందే సెన్సేషన్ అయ్యాయి.

Brindavanam

సినిమా రిలీజ్ రోజు మార్నింగ్ షో నుంచే సూపర్ హిట్ టాక్ వచ్చింది. కథ, కథనాలు, కొరటాల శివ మాటలు, థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్, చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ, రామ్ – లక్షణ్, పీటర్ హెయిన్, రాజ్ పాలెపు స్టంట్స్ సినిమాకు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి.


ఇక తారక్ అద్భుతమైన నటన ముఖ్యంగా తను ఎమోషన్స్ పండించిన తీరు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. తారక్ డైలాగ్స్, డ్యాన్స్ అండ్ ఫైట్స్‌కు ఫ్యాన్స్ మంత్రముగ్దులైపోయారు. హీరోయిన్ల గ్లామర్‌తో పాటు శ్రీహరి, ప్రకాష్ రాజ్, కోట, బ్రహ్మానందం, ముఖేష్ రుషి, వేణు మాధవ్ తదితరుల పాత్రలు ఆకట్టుకుంటాయి.

Brindavanam

‘బృందావనం’ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడమే కాక 2010లో టాప్ హిట్స్ జాబితాలో చోటు సంపాదించింది. 158 కేంద్రాలలో అర్ధ శతదినోత్సవం జరుపుకున్న ఈ చిత్రం 11 కేంద్రాలలో డైరెక్టుగా వంద రోజులు ప్రదర్శితమైంది. జూనియర్ యన్టీఆర్ కెరీర్‌లో ఓ సూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం పలు భాషల్లో రీమేక్ కావడం విశేషం.


ముఖ్యంగా బెంగాలీలో అటు బంగ్లాదేశ్ లోనూ ఇటు పశ్చిమ బెంగాల్‌లోనూ ఈ సినిమా పునర్నిర్మితమైంది. ఇక కన్నడ, ఒడియా, మరాఠీ భాషల్లోనూ రీమేక్ అయింది. హిందీలోనూ ‘సూపర్ ఖిలాడీ’ పేరుతో అనువాదమై అలరించడం విశేషం. ఇక క్లైమాక్స్‌లో నటరత్న, స్వర్గీయ యన్టీఆర్ గ్రాఫిక్ వర్క్ హైలెట్ గా నిలవడమే కాక సినిమా ఎండింగ్‌కు ప్లస్ అయింది. తారక్ కెరీర్లో మంచి ఫ్యామిలీ చిత్రంగా ‘బృందావనం’ నిలిచిపోతుంది.Brindavanam

Related Tags :

Related Posts :