లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

కోవిడ్ రోగులకు చికిత్స, మారిపోయిన నర్సు ముఖం..ఫొటో వైరల్

Published

on

nurse’s before & after pictures : కోవిడ్ యోధుల సహకారంతో ప్రపంచం కరోనా వైరస్‌తో విజయవంతంగా పోరాడుతోంది. ఎంతోమంది వైరస్ ను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. వీరిలో ప్రధానంగా వైద్యులు, వైద్య సిబ్బంది అహర్నిశలు విశేషంగా కృషి చేస్తున్నారు. PPE Kits ధరించి గంటల తరబడి వారికి సేవలు అందించాల్సి వస్తోంది. దీనివల్ల ఎన్ని సమస్యలు ఎదురైనా..వారు భరిస్తూ..రోగులకు చికిత్స అందిస్తున్నారు. తాజాగా..ఓ నర్సుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గతంలో ఉన్న ఫొటో, ఇప్పుడున్న ఫొటో ఆమె పోస్టు చేశారు. గతంలో నవ్వుతూ..ఎంతో అందంగా కనబడుతున్న ఆమె..ప్రస్తుతం ముఖం పూర్తిగా మారిపోయింది. పీపీఈ కిట్ ధరించడం వల్ల ముఖంపై మడతలు, ఎర్రచారికలు, వెంట్రకలు పోయి..కనిపిస్తోంది.ప్రతి రోజు 10 నుంచి 12 గంటల పాటు కిట్స్ ధరిస్తూ..ప్లాస్టిక్ సూట్లను ధరించడం, చేతి తొడుగులు ధరిస్తున్నారు. యునెటైడ్ స్టేట్స్ లోని టేనస్సీకి చెందిన Kathryn నర్సు ఎనిమిది నెలల పాటు కోవిడ్ – 19 రోగులకు చికిత్స చేయించడంలో ముందు వరుసలో నిలిచారు. 8 నెలల కాలంలో ఆమె తీసుకున్న ఫొటోలు ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. మొదటి ఫొటో గ్రాడ్యుయేషన్ తర్వాత..నవ్వుతూ..ఉంది. రెండో ఫొటో..గుర్తు పట్టరానిదిగా ఉంది.


Sputnik-V వ్యాక్సిన్ పై రష్యా కీలక ప్రకటన


టెనస్సీ రాష్ట్రంలో ఇప్పటికే 4 వేల 200 మందికి పైగా మరణాలు సంభవించాయి. 3 లక్షల 30 వేల కోవిడ్ – 19 కేసులు నమోదయ్యాయి. రోగులను రక్షించడానికి వారు ఎలాంటి కృషి చేస్తున్నారో నర్సు ఫొటో చూస్తే అర్థమౌతుంది. ఆసుపత్రిలో భారీగా కేసులు పెరుగుతుండడంతో గంటల తరబడి ఆమె పని చేస్తున్నారు. నెటిజన్లు ఆమె కృషిని కొనియాడుతున్నారు. గ్రేట్..అంటూ కితాబిస్తున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *