Nut Pierces 5-Year-Old's Skull In Bihar, Removed Surgically

సర్జరీ సక్సెస్ : ఆ బాలుడి పుర్రెలో బోల్ట్.. బ్రెయిన్ సేఫ్!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బాలుడి తలలోని బ్రెయిన్ అంచుల వరకు దూసుకెళ్లిన 20 మిల్లీమీటర్ల ఐరన్ నట్ ను వైద్యులు విజయవంతంగా తొలగించారు.  పంపుసెట్ పేలిన ఘటనలో బాలుడి తలలోకి ఐరన్ బోల్ట్ బ్రెయిన్ దగ్గరగా దూసుకెళ్లింది.

పట్నా: బాలుడి తలలోని బ్రెయిన్ అంచుల వరకు దూసుకెళ్లిన 20 మిల్లీమీటర్ల ఐరన్ నట్ ను వైద్యులు విజయవంతంగా తొలగించారు.  పంపుసెట్ పేలిన ఘటనలో బాలుడి తలలోకి ఐరన్ బోల్ట్ బ్రెయిన్ దగ్గరగా దూసుకెళ్లింది. సరైన సమయంలో సర్జరీ చేయడంతో  బాలుడిని సేవ్ చేసినట్టు వైద్యులు వెల్లడించారు. అసలేం జరిగిందంటే..  

పేలిన పంపుసెట్.. గాల్లోకి ఐరన్ బోల్టులు..
స్కూలుకి ఆ రోజు సెలవు. పిల్లలందరూ ఆడుకుంటున్నారు. పోలంలోని పంపుసెట్ దగ్గర చిన్నారులు అడుకుంటున్నారు. ఇంతలో పంపుసెట్ ఫ్యాన్ బెల్ట్ ఊడిపోయింది. అంతే.. పెద్ద శబ్దం.. పంపు సెట్ నుంచి నట్లు, బోల్ట్ లు గాల్లోకి ఎగిరి పిల్లల వైపు దూసుకొచ్చాయి. ఆడుకుంటున్న పిల్లల్లో ఐదేళ్ల బాలుడి తలలోకి బోల్ట్ లు దూసుకెళ్లాయి. ఈ ఘటన బిహార్ లోని చాంపరన్ జిల్లాలోని కత్రియా గ్రామంలో చోటుచేసుకుంది. ఛాబిలా కుమార్ (5) అనే బాలుడి తలలోకి ఐరన్ నట్లు చొచ్చుకొని పోవడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. అది గమనించిన బాలుడి అంకుల్ వెంటనే చంద్ర ఆస్పత్రికి తరలించాడు. 

ఔట్ ఆఫ్ డేంజర్.. బాలుడు సురక్షితం..
అక్కడి వైద్యులు బాలుడి పరిస్థితి పరీక్షించగా.. తలలోకి ఐరన్ నట్ దూసుకెళ్లినట్టు గుర్తించారు. దాదాపు బ్రెయిన్ దగ్గరగా లోతుగా చొచ్చుకొనిపోయినట్టు తెలిపారు. పిల్లాడికి సీరియస్ గా ఉందని, వెంటనే సర్జరీ చేయాల్సిందిగా సూచించారు. లక్కీగా అదే ఆస్పత్రిలో న్యూరో సర్జన్ రోహిత్ కుమార్ ఉండటంతో బాలుడికి సర్జరీ చేసి సక్సెస్ సాధించినట్టు ఆస్పత్రి వైద్యులు చంద్ర సువేశ్ చెప్పారు. ప్రస్తుతానికి బాలుడి బ్రెయిన్ కు ఎలాంటి డేంజర్ లేదని.. ఐరన్ నట్ ను తొలగించినట్టు తెలిపారు. కొన్నిరోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుందని డాక్టర్ వెల్లడించారు. బాలుడి ప్రాణాలను కాపాడిన వైద్యులకు చిన్నారి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. 

Related Posts