లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

ప్రశ్నిస్తుంటే పారిపోయే వ్యక్తిని మళ్లీ అధ్యక్షుడిని చెయ్యాలా?: ట్రంప్‌పై ఒబామా విమర్శలు

Published

on

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేవలం వ్యక్తిగత లాభం, ఆయన సంపన్న మిత్రుల కోసమే ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి రావాలని ఆరాటపడుతున్నట్లు విమర్శించారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనే విషయంలో ట్రంప్‌కు సరైన ప్రణాళిక లేదన్నారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల తేదీ దగ్గరపడటంతో పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ తరపున ప్రచారం చేస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ట్రంప్‌కి సామాన్యులైన అమెరికన్లపై ఎలాంటి సానుభూతి, ఆందోళన లేదని.. కేవలం వ్యక్తిగత స్వార్థం, సంపన్న మిత్రుల శ్రేయస్సు కోసమే రెండోసారి అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ట్రంప్ చుట్టూ ఉండే వారు లాబీయింగ్‌లు చేసేవారే ఉన్నారని, సామాన్యులు ఎవ్వరూ ట్రంప్‌కు దగ్గరలో ఉండట్లేదని ఒబామా అభిప్రాయపడ్డారు. డెమోక్రాట్‌ అభ్యర్థులు బైడెన్‌, కమలా హారిస్‌లు మాత్రం మీకోసం, మనందరి కోసం పనిచేస్తారని ఆయన ప్రచారంలో నొక్కి ఒక్కానించారు. వీరికి మద్దతు తెలపాలని అమెరికన్‌ ఓటర్లకు బరాక్‌ ఒబామా విజ్ఞప్తి చేశారు.డోనాల్డ్ ట్రంప్ ప్రశ్నల నుంచి పారిపోయే వ్యక్తి అని,అతన్ని మళ్ళీ అధ్యక్షుడిని చేస్తారా? అని ప్రశ్నించారు. వాస్తవానికి, ట్రంప్ ఎన్నికల ప్రచారం సందర్భంగా “60 మినిట్స్” అనే డిబేట్‌కు వెళ్లారు. ఈ సమయంలో, అతను పక్షపాత ఆరోపణలు చేస్తూ ఇంటర్వ్యూ మధ్యలో నుంచి వెళ్లిపోయాడు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ.. సవాళ్లను, కఠిన ప్రశ్నలను ఎదుర్కొనే ధైర్యం ట్రంప్‌కు లేదని విమర్శించారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో స్పష్టమైన ప్రణాళిక లేనందునే ప్రస్తుతం అమెరికాలో చెత్త పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫ్లోరిడా, మియామీ ప్రాంతాల్లో డెమోక్రాట్‌ అభ్యర్థుల తరపున ఒబామా ప్రచారం నిర్వహించారు.ట్రంప్ మాటలను పట్టించుకోకపోవడాన్ని చూస్తుంటే.. తనకు పిచ్చి పట్టిందేమో అనే అనుమానం కలుగుతుందని అన్నారు. అధ్యక్షుడిగా మీరు మీడియా ప్రశ్నల నుండి పారిపోలేరని, కఠినమైన ప్రశ్నల నుండి పరిగెత్తని వ్యక్తిని ఎన్నుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యాంకర్ లెస్లీ స్టహగల్ పక్షపాతం, ద్వేషం మరియు మొరటుతనంతో ప్రశ్నలు అడుగుతున్నారని ఆరోపిస్తూ ’60 మినిట్స్’ కార్యక్రమం నుంచి ట్రంప్ బయటకు వచ్చేశారు. ఈ విషయంలో ట్రంప్ విమర్శలకు గురవుతున్నారు.


Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *