లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

A Promised Land : మన్మోహన్ పై ఒబామా ప్రశంసలు

Published

on

Obama On Manmohan Singh : భారతదేశ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రశంసలు కురిపించారు. ఆయన అసాధారణ విజ్ఞానం కలిగిన నిరాడంబరమైన వ్యక్తి అంటూ కొనియాడారు. A Promised Land పేరిట ఒబామా పుస్తకం రాశారు. ఈ బుక్ లో ప్రపంచంలోని పలు దేశాల నేతల గురించి రాసుకొచ్చారు. 2010లో అధ్యక్షుడి హోదాలో ఒబామా భారత్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నారు. వీరద్దరూ కలిసి..పలు విషయాలపై చర్చించుకున్నారు. అప్పటి పర్యటన గురించి విషయాలను బుక్ లో రాశాను. ఈ పుస్తకం నవంబర్ 17న విడుదల కానుంది.1990లలో భారతదేశానికి ఆర్థిక మంత్రిగా ఉన్న వ్యక్తిని తాను కలిసినట్లు, ఆయనకు ఏడు పదుల వయస్సు ఉందని, తెల్లటి గడ్డం, తలపాగాతో కనిపించారని ఒబామా రాసుకొచ్చారు. ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో లక్షలాది మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేయడానికి కృషి చేశారన్నారు. మన్మోహన్ సింగ్ చాలా తెలివైన వారని, అంతేగాకుండా..నిజాయితీ పరుడంటూ వెల్లడించారు.విదేశాంగ ఒప్పందాలకు మాజీ ప్రధాని మన్మోహన్ ప్రాముఖ్యం ఇచ్చేవారని పుస్తకంలో రాశారు. ఢిల్లీలో ఆయనతో కలిసి పలు ఒప్పందాలు చేసుకున్నట్లు ఒబామా వెల్లడించారు. భారతదేశం రాజకీయాలు ఇప్పటికీ మతం, వంశం, కులం చుట్టూ తిరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేశారాయన. మన్మోహన్ సింగ్ ఇంట్లో భోజనం చేసిన విషయాన్ని కూడా ఆయన వెల్లడించారు. ఆ సమయంలో సోనియా, రాహుల్ గాంధీ కూడా ఉన్నారని తెలిపారు. సోనియా గాంధీ కూడా శక్తి, తెలివిగల మహిళ అన్నారు.అయితే..కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ గురించి.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌పై ఒబామా సెటైర్లు విసిరారు. ఒబామా కొత్త పుస్తకంలో మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీలను ప్రస్తావించారు. తన కొత్త పుస్తకం ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్‌లో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి ఏమనుకుంటున్నాననేది వివరిస్తూ.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రాహల్‌పై తన బుక్‌లో సెటైరికల్‌గా రాశారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *