Octopus High security in Uppal during India-Australia 1st ODI match on March 2

అక్టోపస్ పహారా: ఉప్పల్ వన్డే మ్యాచ్‌కు హై సెక్యూరిటీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు.

భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. యాంటి టెర్రర్ కమాండో యూనిట్ (అక్టోపస్) బృందం హైదరాబాద్ నగరంలో కట్టుదిట్టమైన భద్రతతో పహారా కాస్తోంది. ఏ క్షణంలో ఏమౌతుందనే హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో ఉప్పల్ స్టేడియం వేదికగా ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య (మార్చి 2, 2019) శనివారం (మధ్యాహ్నం 1.30 గంటలకు) తొలి వన్డే జరుగనుంది.
Read Also : Booking Start : జియోఫోన్2 ఫ్లాష్ సేల్ సందడి

ఈ సందర్భంగా ఆసీస్-భారత క్రికెటర్ల భద్రత కోసం అక్టోపస్ బృందం, ఆరు భద్రత బలగాలతో కలిపి మొత్తం 2వేల 300 మంది భద్రతా సిబ్బంది ఉప్పల్ స్టేడియం దగ్గర మోహరించాయి. మ్యాచ్ జరిగే రోజున మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు మెట్రో సర్వీసులను నడపాలని నిర్ణయించారు. మ్యాచ్ వీక్షించేందుకు ఉప్పల్ స్టేడియానికి వచ్చేవారంతా లోపలికి ల్యాప్ టాప్ లు, బ్యానర్లు, వాటర్ బాటిల్స్, కెమెరాలు, సిగరెట్లు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, పేలుడు పదార్థాలు, షార్ప్ మెటల్స్, ప్లాస్టిక్ ఐటమ్స్, ఆహార పదార్థాలను అనుమతించమని అధికారులు వెల్లడించారు. 

పార్కింగ్ ఏరియా, వెహికల్ చెకింగ్ పాయింట్ తో సహా స్టేడియం చుట్టూ 200 సీసీ కెమెరాలను అమర్చారు. సీసీ కెమెరా దృశ్యాలను జాయింట్ కమాండ్, కంట్రోల్ రూం అధికారులు ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తుంటారు. 250 మంది భద్రతా సిబ్బంది, 509 ట్రాఫిక్ పోలీసులు, 985 మంది పోలీసులు స్టేడియంలో భద్రత చర్యలను చేపట్టనున్నారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఎంట్రీ చెక్ పోస్టుల దగ్గర వచ్చే పోయే ప్రతిఒక్కరిని తనిఖీలు చేయనున్నారు. క్రికెటర్లు, వీవీఐపీ, వీఐపీలు వెళ్లే మార్గంలో అంత సవ్యంగా ఉండేలా చర్యలు చేపట్టారు.
Read Also : బీసీసీఐ వార్నింగ్ : ఐపీఎలా.. పీఎస్ఎలా.. ఏదో ఒకటి తేల్చుకోండి

ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి జెన్ ప్యాక్ట్ మీదుగా వెళ్లే మెయిన్ రోడ్డు, రామాంత్ పూర్ వెళ్లే విశాల్ మార్ట్ పక్కన వాహనాలను పార్కింగ్ చేసేందుకు అనుమతి లేదు. టీఎస్ఐఐసీ పార్కింగ్ ప్రాంతాల్లో మాత్రమే వీక్షకులు తమ వాహనాలను పార్క్ చేయాల్సి ఉంటుందని అధికారులు సూచించారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎల్ బీ నగర్, వరంగల్ మీదుగా వచ్చే భారీ లోడ్ వాహనాలను కూడా హబ్సిగూడలోకి అనుమతించరు. ఈ మార్గంలో వచ్చే వాహనాలను మరో మార్గానికి దారి మళ్లించనున్నారు.   
Read Also : ద్రవిడ్ సలహాలే ఫామ్‌ను తెచ్చిపెట్టాయి: కేఎల్ రాహల్

Related Posts