లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-1

NEETలో 720/720 మార్కులు సాధించిన సోయబ్

Published

on

Odisha స్టూడెంట్ NEET‌లో 720/720 మార్కులు సాధించి టాప్ గా నిలిచాడు. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులలో అడ్మిషన్ కోసం రాసిన ఎంట్రన్స్ టెస్ట్ లో వంద శాతం సక్సెస్ సాధించడం ఫుల్ జోష్ తెప్పించిందంటూ.. తాను మెడికల్ స్టడీస్ పూర్తి చేసి కార్డియాలజిస్ట్ అవుతానని చెప్తున్నాడు సోయబ్.

కరోనావైరస్ మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో ఒత్తిడులు మధ్య రాసిన పరీక్ష కోసం లాక్‌డౌన్ లో మరింత కష్టపడి చదివినట్లు చెప్పుకొచ్చాడు.‘2018 నుంచి నేను సొంతూరుకి వెళ్లలేదు. రోజుకు 10 నుంచి 12గంటల పాటు చదివేవాణ్ని. దానికోసం అమ్మ, చెల్లితో పాటు ఇక్కడే ఉండిపోయా’ అని సోయబ్ చెప్పాడు.

లాక్ డౌన్ సమయంలో కోటాలో ఉండే స్టూడెంట్లు అంతా ఇళ్లకు తిరిగివెళ్లిపోవాలని సూచించారు. సోయబ్ మాత్రం తల్లి, సోదరితో కలిసి అక్కడే ఉంటూ.. కోటా అల్లెన్ కెరీర్ ఇన్‌స్టిట్యూట్ కోచింగ్ క్లాసులు వింటూ ప్రిపేర్ అయ్యాడు.

ఇదే సోయబ్ అఫ్తాబ్ పర్ఫెక్ట్ స్కోరు సాధించాడని కారణమవడంతో పాటు దేశాంలో రికార్డ్ రేంజ్‌లో ఫస్ట్ స్కోర్ తీసుకొచ్చింది. ఈ మార్కులతో ఢిల్లీకి చెందిన ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) లో సీట్ దొరకడం ఖాయం. అది కూడా అతను కోరుకున్న కార్డియాక్ సర్జరీ స్పెషలైజేషన్ లో.

‘సొసైటీలో ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ల కోసం కష్టపడాలనుకుంటున్నా. యువతను ప్రేరేపించి మరింత కష్టపడి దేశం కోసం పనిచేయాలనుకుంటున్నా’ అని అన్నాడు.

సోయబ్ తండ్రి కన్‌స్ట్రక్షన్ వ్యాపారంలో పనిచేస్తుంటాడు. అతనికో చెల్లి కూడా ఉంది. ఇప్పుడు ఆ కుటుంబం అజ్మీర్ షరీఫ్ దర్గాను సందర్శించాలని అనుకుంటున్నట్లు సోయబ్ చెప్పాడు.

ఈ ఏడాది NEET పరీక్షను 7.7లక్షలకు పైగా క్లియర్ చేసుకున్నారు. నిజానికి 16లక్షల మంది పరీక్ష రాసేందుకు రిజిష్టర్ చేసుకున్నారు. మే 3న జరగాల్సి ఉన్న పరీక్ష జులై 26కు వాయిదా పడి చివరకు సెప్టెంబర్ 13న జరిగింది.

కొవిడ్-19 నిబంధనల కారణంగా పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు బుధవారం పరీక్ష నిర్వహించనుంది మేనేజ్మెంట్.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *