పెళ్లిళ్లు..అంత్యక్రియలు జరగాలంటే పోలీసుల పర్మిషన్ తప్పనిసరి : ఒడిశా సర్కార్ కొత్త రూల్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా కొత్త కొత్త రూల్స్ ను తెస్తోంది. అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లిళ్లు తూతూ మంత్రంగా అవుతున్నాయి. అయ్యిందిలే అన్నట్లుగా కానిచ్చేస్తున్నారు. కారణం కోరోనా. పెళ్లికి వచ్చినవారుతో పాటు పెళ్లి కూతురు పెళ్లికొడుకు మాస్క్ లు పెట్టుకోవాల్సిందే. భౌతిక దూరం పాటించాల్సిందే. ఈ కరోనా కాలంలో ఒడిశా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లిళ్లు జరగాలన్నా..ఆఖరికి అంత్యక్రియలు చేయాలంటే ఇకనుంచి పోలీసుల నుంచి పర్మిషన్ తప్పనిసరిగా చేసింది. ఈ కార్యక్రమాలు జరగాలంటే పోలీసులు అనుమతి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.

ఒడిశాలో కూడా కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అధికారులు ఈ ఉత్తర్వులు విడుదల చేశారు. కరోనా మహమ్మారి నియంత్రణకు ఈ మరింత కఠినంగా ఉండాల్సిందేనంటున్నారు.

పెళ్లిలు, అంత్యక్రియలకు ఎంత మంది హాజరుకావాలో కూడా ఈ ఉత్తర్వుల్లో సూచించారు. పెళ్లిళ్లకు 50 మంది, అంత్యక్రియలకు 20 మందికి మించి ఉండకూడదు.అలాగే పెళ్లిళ్లు జరగాలన్నా అంత్యక్రియలు జరగాలన్నా.. ముందుగానే స్థానిక పోలీసుల అనుమతి తీసుకోవాలి.

కరోనా నిబంధనల్లో భాగంగా భౌతిక దూరం, మాస్కులు తప్పనిసరిగా ఉండాల్సిందే. పాటించి తీరాల్సిందే.ఈ నిబంధనలు అమలు చేయాల్సిన బాధ్యత పెళ్లిళ్లు జరిగే ఫంక్షన్ హాళ్ల యజమానులపైనే ఉంటుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.

Related Posts