తప్పుడు మర్డర్ కేసు బుక్ చేసిన పోలీస్‌కి రూ.5 లక్షల ఫైన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

False Murder: మర్డర్ కేసులో నిందితులను కాకుండా ఇతరులను శిక్షించినందుకు గానూ.. ఒక్కొక్కరికి రూ.2.5లక్షల చొప్పున ఇద్దరికి రూ.5లక్షలు ఇవ్వాలని ఒడిశా మానవ హక్కుల కమిషన్ పోలీసుని ఆదేశించింది. పైక్మాల్ పోలీసులు ఆ వ్యక్తులను ఓ బాలుడ్ని హత్య చేసిన కేసులో 2016లో అరెస్టు చేశారు.

ఆశ్చర్యకరంగా ఆ బాలుడు రెండేళ్ల తర్వాత తిరిగి ఇంటికి వచ్చేశాడు. విచారణ జరిపి కేసు నమోదు చేసిన పోలీస్ అధికారి ప్రకాశ్ కుమార్ కర్ణా నుంచి రూ.5లక్షల రికవరీ చేయాలని మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. పిప్లిపాలి గ్రామంలో ఉండే జీతూ దండసేనా అనే బాలుడు 2016 డిసెంబర్ 7 నుంచి కనిపించకుండాపోయాడు.ఈ కేసు విచారణలో భాగంగా హలు గుర్లా, రాఘబ్ నాయక్ అనే ఇద్దరినీ 2016 డిసెంబర్ 24న మర్డర్ చేశారనే నెపంతో అరెస్టు చేశారు. ఆధారాలు నాశనం చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలు చూపిస్తూ జైలుకు పంపారు.

బిశ్వప్రియ కనుగో, చంద్రనాథ్, బిజయ్ కుమార్ అనే ముగ్గురు పిటిషనర్లు..ఒడిశా మానవ హక్కుల సంఘానికి ఈ ఘటన గురించి తెలియజేశారు. పోలీసులు మిస్ అయిన వ్యక్తి సెల్ ఫోన్, కొందరి స్టేట్‌మెంట్లు తీసుకుని క్రైం చేసినట్లు కన్ఫామ్ చేశారు.

ఆ తర్వాత ఇద్దరినీ జ్యూడిషియల్ కస్టడీకి పంపారు. సంవత్సరం జైలు శిక్ష అనుభవించిన తర్వాత వారికి బెయిల్ వచ్చింది.

ఆంధ్రా – ఒడిశా బోర్డర్ ఇష్యూ, గ్రామస్తుల మధ్య ఘర్షణలు


జీతూ దండసేన 2018లో కోల్‌కతా నుంచి ఇంటికి తిరిగివచ్చాడు. మర్డర్ కేసులో అరెస్ట్ అయిన ఇద్దరు వ్యక్తులు మానవ హక్కుల కమిషన్ కు అతణ్ని తీసుకుని వెళ్లారు.

‘సరైన ఇన్వెస్టిగేషన్ లేకుండా మానవ హక్కులు ఉల్లంఘిస్తూ పోలీసులు కేసులు ఫైల్ చేశారు. మైనర్ మిస్ అవడంతో ఏమీ చేయకుండానే ఆ ఇద్దరు క్రైంలో పాల్గొన్నట్లు బుక్ చేసేశారు. సైంటిఫిక్ పద్ధతులు, సరైన టెక్నిక్ వాడకుండా నిందితుడు ఇతనేనంటూ బ్లేమ్ చేశారు’ అని విశ్వరూప కనుగో చెప్పారు.

పోలీస్ కేసు రీ ఫామ్ చేయాలని ఈ మేర మళ్లీ ఇన్వెస్టిగేట్ చేయాలని సుప్రీం కోర్ట్ ఆర్డర్ చేసింది. దీనిపై విచారణకు ఇద్దరు అధికారులను నియమించింది.

Related Tags :

Related Posts :