Home » ఓ కుక్క తన మేకను కరిచిందని 40 వీధి కుక్కలకు విషం పెట్టి చంపేశాడు
Published
7 months agoon
By
nagamaniతన మేకను ఓ వీధి కుక్క కరిచిందని మొత్త ఆ గ్రామంలో ఉన్న కుక్కలన్నింటిని చంపేశాడో ఓ వ్యక్తి. ఈ దారుణ ఘటన ఒడిశాలోని కటక్ జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే..కటక్ జిల్లాలోని చౌద్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహాంగా ప్రాంతంలోబ్రహ్మానంద మల్లిక్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతను మేకను పెంచుకుంటున్నాడు. ఓ రోజున ఓ కుక్క తాను పెంచుకునే మేకను కరిచింది. మేక తీవ్రంగా గాయపడింది. దీంతో బ్రహ్మానందకు తీవ్ర ఆగ్రహం కలిగింది. ఛీ..పాడు కుక్కలు నా మేకనే కరుస్తాయా? వీటి అంతు చూస్తానంటూ కోపంతో ఊగిపోయాడు.
దానికి భరత్ అనే వ్యక్తితో కలిసి పక్కాగా ప్లాన్ వేశాడు. మాంసం అంటే కుక్కలకు బాగా ఇష్టం. దీంతో మాంసాన్ని పట్టుకొచ్చి దాంట్లో విషపు గుళికలు కలిపారు. ఆ మాంసాన్ని ఆ గ్రామంలో ఉండే కుక్కలకు పెట్టగా ఆ మాంసం తిన్న 40 కుక్కలు గిలగిలా కొట్టుకుని చనిపోయాయి.
ఇది తెలిసిన గ్రామస్తులు బ్రహ్మానంద మల్లిక్,భరత్ లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే బ్రహ్మానంద, భరత్ లు పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. గ్రామంలో 40 కుక్కలు చనిపోవటం హృదయవికారంగా ఉందని గ్రామస్థులు వాపోయారు.