ఇండియాలో ఫేక్ COVID-19 vaccine అమ్మాలని..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

COVID-19 మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రజలు దొరికిన ప్రత్యామ్నాయాలన్నింటినీ పాటిస్తుంటే.. వ్యాక్సిన్ పేరిట ఫేక్ మందులు తీసుకుని అమ్మకానికి రెడీ అయిపోతున్నారు. ఈ అంశం మీదనే ఒడిశా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ, పోలీసులు శుక్రవారం ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఫేక్ కొవిడ్-19 వ్యాక్సిన్ అమ్ముతున్నట్లు కేస్ ఫైల్ చేశారు.

ప్రహ్లాద్ బిసి అనే వ్యక్తి కొన్ని సీసాలపై కొవిడ్-19 స్టిక్కర్లు అతికిస్తూ పట్టుబడ్డాడు. ‘సీసాల్లో గుర్తు తెలియని లిక్విడ్ పోసి దానిని అమ్మేందుకు ట్రై చేస్తున్న వ్యక్తిని మేం అరెస్ట్ చేశాం. ఆ లిక్విడ్ గురించి చెప్పమని అడుగుతుంటే దానికి తిరస్కరించడంతో పాటు త్వరలోనే దీని గురించి అంతా తెలుసుకుంటారు’ అని చెప్తున్నట్లు బర్గా డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ ఫోన్ ద్వారా వెల్లడించారు.

ఇప్పటివరకూ అతను ఓపెన్ మార్కెట్లో అమ్మలేదని.. దానిని ఎవరూ ఇంజెక్ట్ చేసుకున్నట్లుగానూ ఇన్ఫర్మేషన్ లేదని అధికారులు అంటున్నారు. రిషిదా అనే గ్రామంలో ఆ వ్యక్తి అద్దెకు ఉంటున్నట్లు.. బర్గార్, సంబల్‌పూర్ ప్రాంతాలకు చెందిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు అటాక్ చేయడంతో విషయాలు వెలుగులోకి వచ్చాయి.

బిసి(32) మెట్రిక్యులేషన్ కూడా పాస్ అవని వ్యక్తి.. వద్ద కొవిడ్-19 వ్యాక్సిన్ అంటూ పెద్ద స్టాక్ పెట్టుకున్నాడు. అతని వద్ద ఉన్న మిగిలిన ప్యాకేజీలను కూడా రికవర్ చేసుకున్నాం. ఒక డ్రగ్ నేమ్ మరొక వాటితో పోలిక లేకుండా ఉంది.

అతనిపై సెక్షన్ 18సీ కేసు బుక్ చేశారు. గతంలోనూ ఇటువంటి ఫేక్ డ్రగ్ అమ్మకాల వంటివి జరిపాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. తర్వాతి పరీక్షల కోసం ఈ శాంపుల్స్ అన్నింటినీ భువనేశ్వర్ ల్యాబరేటరీకి పంపించాం. శానిటైజర్లు అంటూ కనిపించిన కొన్ని బాటిళ్లను కూడా సీజ్ చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.

Related Posts