లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

ఒడిశా చిత్రకారుడి అభిమానం, సీసాలో బైడెన్ చిత్రపటం

Published

on

Odisha Miniature Artist : తమ అభిమానాన్ని చాటుకొనేందుకు కొంతమంది చిత్రకారులు వినూత్నంగా ప్రయత్నిస్తుంటారు. బియ్యం, చాక్ పీస్, ఇతర వస్తువులపై వారి వారి చిత్రాలు, వారికి సంబంధించిన విశేషాలను వాటిపై పొందుపరుస్తుంటారు. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్న జో బైడెన్ ఫొటోను ఒడిశా చిత్రకారుడు L Eswar Rao..సీసాలో ఏర్పాటు చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
మరోవైపు…అమెరికా చరిత్రలో మరో కీలక ఘట్టానికి కౌంట్‌ డౌన్ స్టార్ట్ అయింది. అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన కమలా హారిస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఇనాగురేషన్ పేరుతో అధ్యక్ష ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వాషింగ్టన్ డీసీలో ఇది జరుగుతుంది. ప్రమాణ స్వీకారం పూర్తవ్వగానే బైడెన్ అధికారికంగా అమెరికాకు 46వ అధ్యక్షుడు అవుతారు. సాధారణంగా అధ్యక్ష పదవి కన్నా ముందే ఉపాధ్యక్ష పదవికి ప్రమాణస్వీకారం జరుగుతుంది. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం పది గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం మొదలవుతుంది. అంటే ఇండియన్‌ టైమింగ్స్‌లో 2021, జనవరి 20వ తేదీ రాత్రి 10 గంటల 30 నిమిషాలకు స్టార్ట్ అవుతుంది.