లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

covid rules ఉల్లంఘిస్తే..జైలు శిక్ష, లక్ష ఫైన్

Published

on

covid rules : కరోనా వైరస్ వ్యాప్తికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు పాటించడం లేదు. దీంతో కఠినంగా వ్యవహరించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఉల్లంఘనలు అతిక్రమిస్తే..రెండేళ్ల జైలు శిక్ష, రూ. లక్ష వరకు జరిమాన పెంచాలని Epidemic Diseases (Odisha Amendment) Bill, 2020ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ప్రతిపక్షాల విమర్శల మధ్య ఈ బిల్లును ఆమోదించింది.అసెంబ్లీలో ఆరోగ్య మంత్రి నాబా కిషోర్ దాస్ మాట్లాడుతూ…ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపట్టినా..కొంతమంది సోషల్ డిస్టెన్స్, మార్గదర్శకాలు పాటించడం లేదని..దీంతో ప్రజల ఆరోగ్యానికి హానీ కలుగుతోందన్నారు. దీంతో కొత్త బిల్లును ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు.కాంగ్రెస్ లీడర్ తారా బాహినిపతి మాట్లాడుతూ…8 లక్షల మంది వలసదారులు రాష్ట్రానికి తిరిగి వచ్చారని, వలస కూలీల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని దీనిద్వారా కేసులు పెరుగుతున్నాయన్నారు. ప్రతిపక్ష నాయకుడు ప్రదీప్ నాయక్ మాట్లాడుతూ..యంత్రాలు, ఇతర వస్తు సామాగ్రీని అధిక ధరలకు కొనుగోలు చేశారనే విషయాన్ని ప్రస్తావించారు.అవినీతి అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. దీనిపై ఆరోగ్య మంత్రి నాబా కిషోర్ దాస్ మాట్లాడుతూ.. మాస్క్ లు, పీపీఈ కొనుగోలు వ్యవహారంలో అవకతవకలు జరిగినట్లు వస్తున్నా ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నట్లు, దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *