odisha priest sacrificed man to stop corona In bhahmanidevi temple

కరోనా మహమ్మారి అంతం కావాలని నరబలి ఇచ్చిన అర్చకుడు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనాను అంతం కావాలని ఓ పూజారి ఘోరాతి ఘోరమైన నరబలికి పాల్పడ్డాడు. ప్రజలు కరోనా బారిన పడి చనిపోతున్నారనీ ఓ మనిషినే బలి ఇచ్చాడు ఈ మానవమృగం. మూర్ఖత్వంతో మానవత్వాన్ని మరచిపోయాడు. ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్న అంత్యంత ఘోరమైన ఘటన ఒడిశాలోని కటక్ జిల్లా నర్శింగ్ పూర్ లో చోటుచేసుకుంది. 

కరోనా పోవాలంటూ  ఏకంగా నరబలి ఇచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. బంధహూడ సమీపంలో ఉన్న బ్రాహ్మణిదేవి ఆలయంలో ఈ పాశవిక చర్య జరిగింది.

కరోనా నుంచి ప్రజలకు విముక్తి కలగాలని సంసారీ ఓజా అనే  72 ఏళ్ల బ్రాహ్మణిదేవీ దేవాలయ అర్చకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన తెలిసి ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అర్చకుడు సంసారి హోజాను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా..ప్రజలకు కరోనా మహమ్మారి నుంచి కాపాడాలనే ఈ పనిచేశానని అంటున్నాడు ఈ మూర్ఖత్వపు అర్చకుడు. 

Read: ఉద్యోగం పేరుతో వ్యభిచారంలోకి దింపే యత్నం : మహిళపై కేసు నమోదు

Related Posts