లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

హ్యాట్సాఫ్ పోలీసన్నా.. : చీపురుతో రోడ్లు ఊడుస్తున్న ట్రాఫిక్ పోలీస్

Published

on

Odisha Traffic Cop Sweeping A Road : ఒడిశాలోని ఓ ట్రాఫిక్ పోలీసు చీపురు పట్టుకుని రోడ్లు ఊడుస్తున్నాడు. అది తన డ్యూటీ కాకపోయినా సరే ప్రతీరోజు ప్రజల కోసం చీపురు పట్టుకుంటాడు. శుభ్రం చేసేసే ఆ ట్రాఫిక్ పోలీసు పేరు మోహన్ రౌత్.


కటక్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌‌కు చెందిన మోహన్ రౌత్ చేసే ఈ మంచి పని ఎందరినో కదిలించింది. నెటిజన్లు అయితే లవ్ ఎమోజీలతో రాత్రికి రాత్రే ఈ పోలీస్ నిజమైన హీరో అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. మోహన్ రౌత్ ఎందుకు రోడ్లు తుడుస్తున్నారో తెలిస్తే మీరు కూడా హ్యాట్సాఫ్ అంటారు..మోహన్ రౌత్ రోడ్లు ఊడుస్తుండగా చూసి ఎందుకు ఊడుస్తున్నారో తెలుసుకునన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్‌గా మారింది.


వర్షాకాలం..భారీ వర్షాలకు గులకరాళ్లు, ఇసుక ఎక్కనుంచో కొట్టుకొచ్చి రోడ్డుపై పేరుకుపోతుంటాయి. ఆ చిన్న చిన్న రాళ్లు..ఇసుక వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది. ట్రాఫిక్ నిలిచిపోతోంది. అంతేకాదు రోడ్డుపై వాహనాలు టైర్లు స్కిడ్ అయి జారి పడిపోయే ప్రమాదముందని గ్రహించిన మోహన్ రౌత్ ప్రజల కోసం తాను డ్యూటీ చేసే ప్రాంతమంతా చీపురుతో చక్కగా శుభ్రం చేసేస్తుంటాడు.


మోహన్ రౌత్ కేవలం తన డ్యూటీ మాత్రమే చేసి రోడ్లు ఎలా ఉంటే తనకెందుకు? ఎవరు పడితే నాకెందుకు అని అనుకోకుండా రోడ్లు శుభ్రం చేసిన గొప్ప పని ఎందరినో కదిలిస్తోంది. ఎంతమంచి పని చేశారు పోలీసన్నా.. అని కామెంట్లు చేస్తున్నారు. మోహన్ రౌత్ చేసిన మంచిపనిని గుర్తించిన ఉన్నతాధికారులు ఆయనను సత్కరించారు. సో గ్రేట్ మోహన్ అంటూ ప్రశంసించారు.


కాగా..చాలామంది ట్రాఫిక్ పోలీసులు చేసిన ఎన్నో మంచి పనులు ప్రజల ప్రశంసలు పొందాయి. అసోంలోని గువాహటిలో ట్రాఫిక్‌ విధులు నిర్వహిస్తున్న మిథున్‌దాస్‌య అనే ట్రాఫిక్ పోలీసు..కుండపోతగా కురుస్తున్న వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వర్షంలో తడిచిపోతూ నానిపోతూ..డ్యూటీని మాత్రం మానకుండా అంకితభావంతో పనిచేసి ప్రశంసలు అందుకున్నారు.


అలాగే విజయవాడలోని హనుమాన్ జంక్షన్ సర్కిల్ వద్ద ఎంత ట్రాఫిక్ ఉంటుందో తెలియనిది కాదు. అక్కడ డ్యూటీ చేసే దేవిశెట్టి శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ భారీ వర్షంలో తన డ్యూటీ చేసి శభాష్ అనిపించుకున్నారు. కార్ఖానా జంక్షన్‌లోని మారేడుపల్లి ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ వెంకటేష్‌ తనకు దొరికిన పర్సును ఆ పర్సుకు సంబంధించిన యజమానికి అందించి తన నిజాయితీని చాటుకున్నారు.


ఎల్బీనగర్ లో కూడా ట్రాఫిక్ పోలీసు అధికారి అంజపల్లి నాగమల్లు రోడ్డుపై నిలిచి ఉన్న వర్షపు నీటిని తట్ట తీసుకుని పారిశుద్ధ్య కార్మికుడిలా ఎత్తిపోసి వాహనదారులకు ఇబ్బంది కలుగకుండా పనిచేసి వావ్..ప్రజల కోసం పోలీసులు అంటే ఇటువంటివారే అనిపించారు. ఇలా పోలీస్ అంటే లంచగొండులు..పోలీసులంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల్ని వేధించేవారు.పోలీసులంటే పొగరుబోతులు..అని చెప్పుకునే ఈ కాలంలో ఇటువంటి పోలీసులు ఆ డిపార్ట్ మెంట్ లో తలమానికంగా నిలుస్తున్నారు. అటువంటి పోలీసులు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..హ్యాట్సాఫ్ పోలీసన్నా..

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *