ఎకో ఫ్రెండ్లీ రక్షాబంధన్ : గడ్డిపోచలతో రాఖీలు తయారు చేస్తున్న ఒడిశా మహిళలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఆగస్టు 3 రక్షాబంధన్ పండుగ. అన్నా చెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి శ్రీరామ రక్ష రాఖీ పండుగ. సోదరులకు సోదరీమణులు కట్టే రక్షాబంధన్ ల్లో ఎన్నో రకాలున్నాయి. వారి వారి అభిరుచులకు తగినట్లుగా రాఖీలు కొంటుంటారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ లో వచ్చే రాఖీలు ఆడబిడ్డలకు ఆకట్టుకుంటుంటాయి. అటువంటి రాఖీలు ఎన్నో ఎన్నో.కానీ పర్యావరణహితమైన రాఖీలు మాత్రం ప్రత్యేకమని చెప్పాలి. రక్తసంబంధాలను మరింత దృఢపరిచే రాఖీలు పర్యావరణ హితమనవైతే మరింత సంతోషం కదా..ఒడిశాలో అటువంటి రాఖీలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మయుర్భంజ్ జిల్లాలో ‘సబై’ అనే ప్రత్యేకమైన ‘గడ్డిపోచ’లతో తయారయ్యే రాఖీలు ఎంతో ముచ్చటగా చూపరుల్ని ఆకట్టుకుంటున్నాయి.గత ఐదు సంవత్సరాలుగా స్థానికంగా ఉండే మహిళలు స్వచ్ఛంధ సంస్థల సహకారంతో ఈ ‘హరిత రాఖీ’లను తయారు చేస్తున్నారు. వాటిని మార్కెట్లలో అమ్మి చక్కటి సంపాదనను కూడా పొందుతున్నారు. రంగు రంగుల డిజైన్లతో పూర్తి పర్యావరణ హితంగా తయారు చేయటం ఈ రాఖీల ప్రత్యేకత. గ్రీన్ రాఖీలుగా పిలిచే ఈ రాఖీలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించటంతో మార్కెట్ ల్లో మంచి డిమాండ్ పెరిగింది. దీంతో స్థానిక మహిళలు ఉత్సాహంగా ‘గడ్డిపోచ’లతో రాఖీలను తయారు చేస్తున్నారు. ముఖ్యంగా నేటి కరోనా కష్టకాలంలో ‘సబై’ అనే ప్రత్యేకమైన ‘గడ్డిపోచ’లతో ఈ హరిత రాఖీల తయారీతో మహిళలు చక్కటి ఉపాధిని పొందుతున్నారు.

Related Posts