లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

అమెరికా బడ్జెట్ చీఫ్ గా భారత సంతతికి చెందిన నీరా టాండన్!

Published

on

joe Biden expected to name Indian American Neera Tanden as budget chief అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఈ వారంలోనే తన ఎకనామిక్ టీమ్ యొక్క టాప్ మెంబర్స్ ని ప్రకటించనున్నారు. ఇప్పటికే సెక్రటరీ ఆఫ్‌ స్టేట్-‌ అంటోనీ బ్లింకెన్, ప్రెసిడెన్షియల్‌ ఎన్వాయ్‌ ఫర్‌ క్లైమేట్‌(పర్యావరణ అంశాల ప్రతినిధి)- జాన్‌ కెర్రీ, సెక్రటరీ ఆఫ్‌ హోమ్‌లాండ్‌ సెక్యూరిటీగా అలెజాండ్రో మయోర్కస్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌- అవ్రిల్‌ హెయిన్స్‌, ఐరాసలో అమెరికా దౌత్యవేత్త- లిండా థామస్‌ గ్రీన్‌ఫీల్డ్‌, నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌ జేక్‌ సల్లివన్‌,చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ గా రాన్‌ క్లెయిన్‌ ను బైడెన్ నియమించిన విషయం తెలిసిందే.కాగా,మరి కొద్ది రోజుల్లో తన ఎకనామిక్ టీమ్ యొక్క టాప్ మెంబర్స్ ని జో బైడెన్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే, బైడెన్ ఎకనామిక్ బృందంలో భారత సంతతికి చెందిన నీరా టాండన్‌ కూడా ఉండనున్నట్లు సమాచారం. మెనేజ్‌మెంట్‌ అండ్‌ బడ్జెట్‌ ఆఫీస్‌ డైరెక్టర్‌గా ఇండో-అమెరికన్‌ నీరా టాండన్‌ను జో బైడెన్ నియమించనున్నట్లు అమెరికా మీడియా తెలిపింది.కాగా, భారత సంతతికి చెందిన నీరా టాండన్‌.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా హయాంలో హెల్త్‌కేర్‌ అడ్వైజర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2016 నాటి అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో అప్పటి డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు సలహాదారుగా కూడా పనిచేశారు.ఇక, ఒబామా హయాంలో ఆర్థిక సలహాదారుగా పనిచేసిన( అంతర్జాతీయ) పని చేసిన వాలీ అడెయోమోను కూడా బైడెన్‌ తన టీంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఎకనమిస్ట్‌ సిసిలా రౌజ్‌నును ఆర్థిక వ్యవహారాల సలహాదారుల మండలి చైర్‌పర్సన్‌గా నియమించనున్నట్లు సమాచారం. అత్యంత సన్నిహితుడు, ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో తనకు ఆర్థిక సలహాదారుగా ఉన్న జారేద్‌ బెర్న్‌స్టీన్ సహా హైదర్‌ బౌషీలకు కూడా ఆర్థిక సలహాదారుల మండలిలో స్థానం కల్పించేందుకు బైడెన్‌ సుముఖంగా ఉన్నారని సమాచారం.కోవిడ్‌-19తో ఆరోగ్య, ఆర్థిక సంక్షోభం తలెత్తడం, ఉద్దీపన ప్యాకేజీలు, వాక్సిన్‌ పంపిణీ తదితర సవాళ్లు ముందున్న వేళ ప్రతిభ గల ఎకనమిస్టులను తన టీంలోకి తీసుకోవడం ద్వారా ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టవచ్చనే యోచనలో బైడెన్‌ ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *