woman Earns Lakhs per Day : చిన్నారులకు ఆటపాటలు నేర్పే ఉద్యోగం .. రోజుకు రూ.1.65 లక్షలు సంపాదిస్తున్న మహిళ

పిల్లలను ఆడించడం, కథలు చెప్పడం, పార్కులు, హోటళ్లు, ‘జూ’లు, మ్యూజియాలకు తీసుకెళ్లటం, షికార్లకు తిప్పటం వంటివి చేస్తు రోజుకు లక్షలు సంపాదిస్తోంది ఓ మహిళ.

woman earns Rs.1.65 Lakhs per day : నెలకు రూ.10వేలు సంపాదించాలన్నా ఏదోక చోట ఉద్యోగం చేయాల్సిందే. రోజుకు కనీసం 8,9 గంటలు పనిచేస్తే వచ్చే జీతం దేనీకి సరిపోదని నిటూర్చేవారు ఎందరో. కానీ ఓ మహిళ చేసే పని..దానితో ఆమె రోజుకు రూ.1.65లక్షలు సంపాదిస్తోందని తెలిస్తే వార్నీ..ఎందుకీ చాకిరి మనం కూడా ఎంచక్కా అలా చేస్తే బాగుంటుందే అనుకుని తీరుతారు. ఖరీదైన కార్లు,ప్రైవేట్ జెట్లు, ఓడల్లో ప్రయాణం..ప్రపంచమంతా చుట్టేస్తుంది ఆమె ఆమె చేసే పనిలో భాగంగా. ఇంతకీ ఎవరా మహిళ? ఏం చేస్తోంది అంటే..

 

ఆమె పేరు గ్లోరియా రిచర్డ్స్. అమెరికాకు చెందిన నల్లజాతి మహిళ.వయస్సు 34 ఏళ్లు. గ్లోరియాకు ఆటలు పాటలంటే చాలా ఇష్టం. చక్కగా  ఆడుతుంది పాడుతుంది. చిన్నపిల్లలంటే కూడా చాలా ఇష్టం. చిన్నపిల్లల్ని ఇట్టే ఆకట్టేసుకుంటుంది. ఏడ్చే పిల్లల్ని చిటికెలో ఏడుపు మాన్పించి కిలకిలా నవ్వేలా చేస్తుంది అలా చిన్నపిల్లల్ని..ఆటపాటల్ని కలిపితే తనకున్న ఇష్టాన్ని..టాలెంట్ ను మిక్స్ చేసి చిన్నారులతో అనుసంధానం చేస్తే..అదే తన ఉద్యోగంగా మార్చేసుకుంది. తనకు స్వతహాగా ఆడటం, పాడటం, పిల్లలను ఆడించడం, వాళ్లతో ఓపిగ్గా మాట్లాడటం, కార్లు డ్రైవ్‌ చేయడం వంటి ఆమె హాబీలనే వృత్తిగా మలుచుకుంది. దాన్నే ఆదాయంగా మార్చేసుకుంది. అలా ఉద్యోగాలు, వ్యాపారాలు వంటి వాటితో బిజీబిజీగా జీవితాలు గడిపేవారి పిల్లలను చూసుకుంటుంది గ్లోరియా. సంపాదన కావచ్చు లేదా మరే కారణమైనా కావచ్చు..పిల్లలకు సమయం కేటాయించలేని కోటీశ్వరుల ఇళ్లలో నానీ(ఆయా)గా పనిచేయడాన్ని ఉద్యోగంగా మార్చుకుంది. అలా రోజుకు 2000 డాలర్లు సంపాదిస్తుంది. అంటే భారత కరెన్సీలో రోజుకు రూ.1.65లక్షలు..!

 

కోటీశ్వరుల పిల్లలను ఆడించడం,  కథలు చెప్పడం, పార్కులు, హోటళ్లు, ‘జూ’లు, మ్యూజియాలు ఇలా షికార్లకు తిప్పటం వంటివి చేస్తుంది. వారంతా కోటీశ్వరుల పిల్లలు కాబట్టి గ్లోరియా వారి ఖరీదైన కార్లలోనే తిప్పుతుంది.వారిని కన్నబిడ్డల్లా చూసుకుంటుంది. తద్వారా రోజుకు 2000 డాలర్లు సంపాదిస్తుంది. అదే ఆమె ఉద్యోగంగా మార్చుకోవటంతో భారీగా సంపాదిస్తుంది. ఏ ఇంట్లో నానీగా అదేనండీ ఆయాగా పనిచేస్తే వారి ఇంటికారు ఉపయోగిస్తుంది. అదే ఆరోజుకు ఆమె కారు. ఒక్కో ఇంట్లో ఒక్కో రకం కారు. కోటీశ్వరుల పిల్లలు కాబట్టి అన్నీ ఖరీదైన కార్లే ఉంటాయి.

 

ఆ కార్లలో వారి పిల్లలను బయటికి తీసుకెళ్లి వారిని ఆనందంగా షికార్లు చేయించి తీసుకురావటం ఆమె దినచర్య. ఆమెకు ఒక్క అమెరికాలోనే కాదు దేశవిదేశాల్లో క్లయింట్స్‌ ఉన్నారు. అలా విమానాల్లో దేశాలు తిరుగుతుంది. ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రైవేట్‌ జెట్‌లు, ఓడల్లో ఆమె ప్రయాణిస్తుంటుంది. ఆమె ప్రయాణ ఖర్చులు వారే భరిస్తారు. అలా కొంతమంది గ్లోరిను ఒక రోజు కోసం నియమించుకుంటారు. మరికొందరు వారం లేదా 15 రోజుల లేదా నెల రోజుల కోసం వారి వారి పనులను బట్టి నియమించుకుంటారు ఆయాగా..అలా ఆమె తిండి, ప్రయాణం వంటి అన్ని ఖర్చులన్నీ వారే భరిస్తారు. అలా గ్లోరియా రోజు ఆయాగా ఉండటానికి 2000 డాలర్లు తీసుకుంటుంది. అలా ఆమె సంపాదన భారతీయ కరెన్సీలో రూ.1.65లక్షలు..!! రోజుకు 12 నుంచి 15గంటలు పిల్లల్ని చూసుకోవాలి.

 

అలా గ్లోరియా ఖరీదైన కార్లలోనే కాదు బుక్ చేయించుకున్న క్లైంట్ స్థానికి బట్టి ప్రైవేట్ జెట్ లో కూడా ప్రయాణాలు చేస్తుంటుంది. అలా సంవత్సరమంతా పనిచేయకపోయినా ఏడాదికి రెండు మూడు నెలలు పనిచేస్తే చాలు ఏడాది అంతా హ్యాపీగా బతికేయొచ్చు అంటోంది. నానీ జాబ్ అంటే అనుకున్నంత చెప్పుకున్నంత ఈజీ కూడా కాదు. రోజుకు 2000 డాలర్లు ఇస్తున్నారంటూ దానికి తగినట్లే పిల్లల్ని చూసుకోవాలి. వారికి ఏమాత్రం ఇబ్బంది కలుగకూడదు. పిల్లలు ఏడవకుండ హ్యాపీగా ఉండేలా చూసుకోవాలి. పిల్లలంటే అందరు కామ్ గా ఉండదరు. ఇల్లు పీకి పందిరేసేవారుంటారు. సరిగా తిండి తిననివారుంటారు. నానా పేచీలు పెట్టి పిచ్చెక్కించేవారుంటారు. వారిని తన మాటలతోను..ఆటలతోను ఆకట్టుకోవాలి. మచ్చిక చేసుకోవాలి. తనకు అలవాటు చేసుకోవాలి. వారిని సంతోషంగా ఉండేలా చేయాలి.

 

అదే చెబుతోంది గ్లోరియా. నానీ కొలువు అంత సులవేమీ కాదని. కొంతమంది పిల్లలు చాలా ఏడిపిస్తారు..నానా ఇబ్బంది పెడతారు. అన్ని భరిస్తాను. ఎందుకంటే నా ఉద్యోగానికి ఏమాత్రం చెడ్డ పేరు రాకూడదని. అలాగే తనను నమ్మి వారి పిల్లలను అప్పగిస్తారంటే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చెబుతుంది. పలు విధాలుగా వచ్చే సమస్యల్ని సమర్థించుకుంటు పోవాలి. ఇబ్బందులు అనేవి ప్రతీ ఉద్యోగంలోను ఉంటాయి. నాకు ఈ నానీ కొలువు అంటే ఇష్టం. అందుకే ఇష్టంతోనే ఇబ్బందుల్ని ఎదుర్కొంటు దీన్నే నా ఉద్యోగంగా మలుచుకున్నానని నానీ కొలువు మాత్రం తనకు తెగ నచ్చిందని గ్లోరియా చెబుతోంది.

 

ఆమె చూసుకునే పిల్లల కుటుంబాల రేంజ్ ఎలా ఉంటుందంటే..ప్రైవేట్ జెట్ లో తీసుకెళ్లేలా ఉంటుంది. క్లైంట్ల లొకేషన కు వెళ్లే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తుంటుంది. క్లైంట్ల కోసం మేము మా పిల్లల్ని చూసుకోవటానికి ఓ మంచి ఆయా కావాలి అనే ప్రకటనలు చూస్తుంటానని దాని కోసం ఉంటర్వ్యూలకు హాజరవుతుంటానని తెలిపింది. తను చేసే ఈ నానీ ఉద్యోగం కోసం తాను పోర్షెస్, టెస్లా వంటి ఖరీదైన కార్లు నడుపుతుంటానని తెలిపింది. పిల్లల పుట్టినరోజు పార్టీలకు వెళుతుంటానని పార్టీ ఫేవర్ గా ఐప్యాడ్ ఇవ్వబడే పార్టీలకు హాజరవుతానని తెలిపింది. బిలియనీర్ల పిల్లల్ని చూసుకోవటమంటే అంత ఈజీ కాదు..ఏ చిన్న పొరపాటు జరిగినా ఉద్యోగం పోవటం కాదు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని..పైగా తాను నల్లజాతీయురాలిని తెల్లపిల్లలకు నానీగా పనిచేయటం కత్తిమీద సాములాంటిదేనని తెలిపింది గ్లోరియా.

 

ట్రెండింగ్ వార్తలు