Anand Mahindra video : క్యారెట్‌ను క్లారినెట్‌గా మార్చేసి సంగీతాన్ని పలికించిన కళాకారుడు.. అద్భుతమంటూ ఆనంద్ మహీంద్రా కితాబు

క్యారెట్‌ను క్లారినెట్‌గా మార్చేసి సంగీతాన్ని పలికించిన కళాకారుడు.. అద్భుతమంటూ ఆనంద్ మహీంద్రా కితాబిచ్చారు.

Anand Mahindra video : క్యారెట్‌ను క్లారినెట్‌గా మార్చేసి సంగీతాన్ని పలికించిన కళాకారుడు.. అద్భుతమంటూ ఆనంద్ మహీంద్రా కితాబు

Anand Mahindra  carrot into a clarinet

Anand Mahindra video :  రాళ్లతో కూడా రాగాలు పలికిస్తారు కళాకారులు. సంగీత కళాకారుల చేతుల్లో ఏ వస్తువు ఉన్నా దాంతో సంగీతం పలికించే ప్రతిభ వారి సొంతం. తుప్పు పట్టిన రేకు ముక్కతో కూడా సంగీతం పలికించేసి మైమరిపిస్తారు. పారేసిన చెత్త డబ్బాలను డ్రమ్ములా వాయించి వావ్ అనిపించుకుంటారు.తాజాగా ఓ కళాకారుడు క్యారెట్ తో సంగీతం పలికించి ఔరా అనిపించాడు. క్యారెట్ ని క్లారినెట్ లా మార్చేసి సంగీతం పలికించి వావ్ అనిపించాడు.దీనికి సంబంధించి వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేయటంతో క్యారెట్ సంగీతం సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది.

తన దృష్టికి వచ్చిన ప్రతిభ..సరికొత్త, వినూత్న వీడియోలను తన ట్విట్టర్ లో షేర్ చేసే ఆనంద్ మహీంద్ర క్యారెట్ సంగీతాన్ని కూడా పోస్ట్ చేశారు. ఆస్ట్రేలియా సంగీత కళాకారుడు ఓ క్యారెట్ ను క్లారినెట్ గా మార్చేసి సంగీతాన్ని పలికించిన వీడియోను ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేశారు. క్యారెట్ పై సంగీతాన్ని అద్భుతంగా పలికించి అందరినీ ఆశ్చర్యపరిచారు సదరు కళాకారుడు. అతని సంగీతానికి ఫిదా అయని ఆనంద్ మహీంద్రా ప్రతి ఒక్కదానిలోనూ సంగీతాన్ని గుర్తించాలంటూ పులుపునిచ్చారు.

ఈ వీడియో షేర్ చేస్తూ ఆనంద్ మహీంద్రా..‘‘దీన్నుంచి నేను పొందిన సందేశం ఏమిటంటే.? మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కదానిలోనూ సంగీతాన్ని గుర్తించొచ్చు అని’’ అంటూ పేర్కొన్నారు. ఈ వీడియోకు లక్షల సంఖ్యలో వ్యూస్ మచ్చాయి. ఈ వీడియోలో క్యారెట్ ను మెషిన్ సాయంతో డ్రిల్ చేసి క్లారినెట్ గా మార్చాడు సదరు కళాకారుడు. ఆనంద్ మహీంద్రా చేసిన ‘‘దీన్నుంచి నేను పొందిన సందేశం ఏమిటంటే.? మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కదానిలోనూ సంగీతాన్ని గుర్తించొచ్చు అని’’ అనే వ్యాఖ్యకు ఓ యూజర్ కామెంట్ ఇలా ఉంది.. ‘‘మీ చుట్టూ ఉన్న వాటిలో సంగీతాన్ని గుర్తించొచ్చు. అలాగే, మీరు చేసే ప్రతి ఒక్కదానిలోనూ సంతోషాన్ని గుర్తించొచ్చు’’ అంటూ వాస్తవాన్ని చమత్కారంగా అందంగా చెప్పుకొచ్చాడు.