‘Baba Elon Musk Ki Jai’: ‘ఎలన్ మాస్క్ బాబాకు జై’ అంటున్న బెంగళూరు వాసులు..పూజలు చేసి హారతులు..ఎందుకంటే..

‘ఎలన్ మాస్క్ బాబాకు జై’ అంటున్న బెంగళూరు వాసులు..పూజలు చేసి హారతులతో నానా రచ్చా చేస్తున్నారు. దీనికి ఓ పేద్ద కారణమే ఉందట..

‘Baba Elon Musk Ki Jai’: ‘ఎలన్ మాస్క్ బాబాకు జై’ అంటున్న బెంగళూరు వాసులు..పూజలు చేసి హారతులు..ఎందుకంటే..

'Baba Elon Musk Ki Jai

‘Baba Elon Musk Ki Jai’: ఎలన్ మస్క్ ( Elon Musk)అంటే ప్రపంచ వ్యాప్తంగా పరిచయం అక్కరలేని పేరు. టెస్లా (Tesla), ట్విట్టర్ (twitter)సంస్థల అధినేతగానే కాదు ప్రపంచ కుబేరుడిగా పేరు. ఇలాంటి ఎలాన్ మస్క్ ని బాబా అంటూ పూజలు చేస్తేస్తున్నారు బెంగళూరులో కొంతమంది. ఎప్పుడూ ఏదోక సంచలనంతో వార్తల్లో నిలిచే ఎలన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలుతో మరింతగా ఆయన పేరు మారుమోగిపోయింది. వినూత్న నిర్ణయాలతో మస్క్ అంటే అంతే అన్నట్లుగా మారారు. అటువంటి మస్క్ బాబా అంటూ పొగిడేస్తున్నారు. బెంగళూరులో ‘ఎలన్ మాస్క్ బాబాకు జై’ (Baba Elon Musk Ki Jai)అంటూ ఆయనకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన పూజలు చేస్తూ హారతులు ఇస్తున్నారు. ‘ఎలన్ మాస్క్ బాబాకు జై’ అంటూ నినాదాలు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

భారతదేశంలో బాబాలకు కొదవేలేదు. గల్లీ గల్లీకి ఓ బాబా దర్శనమిస్తాడు. అటువంటి భారతీయులు (బెంగళూరు) ఏకంగా ట్విట్టర్ అధినేతనే బాబాను చేసేసి పూజలు చేసేస్తున్నారు. బెంగళూరుకు చెందిన సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫెడరేషన్ (Save Indian Family Federation)అనే సంస్థ ‘ఎలన్ మాస్క్ బాబాకు జై’ అంటూ నినాదాలు చేస్తోంది. దానికి కారణమేంటో కూడా చెబుతోంది సదరు ఫెడరేషన్..అదేమంటే..పురుషుల బాధల్ని చెప్పుకునేందుకు ట్విట్టర్‌లో అవకాశం కల్పించిన మస్క్ మాకు దేవుడితో సమానం అందుకే పూజలు చేస్తున్నామంటున్నారీ బృందం.

ఇటువంటి అవకాశం కల్పించినందుకు మస్క్ పట్ల కృతజ్ఞతగా ఇలా ఆయన ఫోటోకు అగరుబత్తీలు వెలిగించి హారతి ఇస్తున్నామంటున్నారు. ఫ్లెక్సీలో స్త్రీవాదులను అంతం చేసేవారు (డిస్ట్రాయర్ ఆఫ్ వొకాషురా), మెన్స్ లైవ్స్ మ్యాటర్ అనే ట్యాగ్‌లైన్ కూడా ప్రింట్ చేయించిందీ ఫెడరేషన్ బృందం..మరి ఈ మస్క్ బాబా పూజలపై మీరు కూడా ఓ లుక్కేయండీ..