Beggars Corporation : యాచకులకు దానం చేయొద్దు .. పెట్టుబడి పెట్టమంటున్న బెగ్గర్స్ కార్పొరేషన్

యాచకులకు దానం చేయొద్దు అంటూ పిలుపునిస్తోంది ‘బెగ్గర్స్ కార్పొరేషన్’. ‘దానం చేయకండి. ఇన్వెస్ట్ చేయండి’ అంటోంది ‘బెగ్గర్స్ కార్పొరేషన్’.

Beggars Corporation : యాచకులకు దానం చేయొద్దు .. పెట్టుబడి పెట్టమంటున్న బెగ్గర్స్ కార్పొరేషన్

Beggars Corporation

Beggars Corporation : యాచకులకు దానం చేయొద్దు అంటూ వినూత్నంగా పిలుపునిస్తోంది ‘బెగ్గర్స్ కార్పొరేషన్’. ‘దానం చేయకండి. ఇన్వెస్ట్ చేయండి’ అంటూ నినదిస్తోంది.‘బెగ్గర్స్ కార్పొరేషన్’ నినాదం కూడా అదే. ఒడిశాకు చెందిన చంద్ర మిశ్రా అనే సామాజిక కార్యకర్త బెగ్గర్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. యాచకులకు కొత్త జీవితాలనిస్తున్నారు. ‘మాకు పెట్టుబడి కావాలి విరాళం కాదు’ అంటు మిశ్రా యాచకుల కోసం వచ్చే పెట్టుబడులను స్వీకరించి.. యాచకుల జీవితాలను మారుస్తున్నారు మిశ్రా. యాచకుల జీవితాలను బాగు చేయాలనే సంకల్పంతో బెగ్గర్స్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసిన ఆయన రెండేళ్లలో 14 యాచక కుటుంబాల స్థితిగతులను మెరుగుపరిచారు.

తాను గుజరాత్ లో ఉన్న సమయంలో గుడి ముందు భిక్షాటన చేసేవారిని చూసి నాకు ఈ వారి జీవితాలను బాగు చేయటానికి ఏమన్నా మార్గం ఉందా? అని ఆలోచించాను. ఆ ఆలోచనలతోనే బెగ్గర్స్ కార్పొరేషన్ ప్రారంభించాలనే ఆలోచన వచ్చిందని తెలిపారు మిశ్రా. అలా ఈ కార్పొరేషన్ ప్రారంభంలో పెట్టుబడులు పెట్టిన వారికి మిశ్రా అసలు మొత్తాన్ని తిరిగి ఇవ్వడంతోపాటు 16.5 శాతం వార్షిక వడ్డీని కూడా చెల్లించి 14 యాచక కుటుంబాలను వ్యాపారవేత్తలుగా మార్చి వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచారు. వారిపై వారికి నమ్మకాన్ని కలిగించారు. మేం యాచించం కష్టపడి బతుకుతాం అనే భరోసా కల్పించారు.

బెగ్గర్స్ కార్పొరేషన్ ద్వారా యాచకులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలనే ఆలోచనకు వచ్చారు. దీని కోసం మివ్రా పలు రాష్ట్రాల్లో పర్యటించి అమలు విధానాల గురించి ఎన్నో కోణాల్లో ఆలోచించి ఎట్టకేలకు 2020 డిసెంబర్ 31న వారణాసికి చేరుకుని..యాచకులకు ఉపాధి కల్పించాలనే ఆలోచనను స్థానిక ఎన్జీవో జన్మిత్ర న్యాస్ తో చర్చించారు. మిశ్రా సేవా కార్యక్రమాల గురించి తెలుసుకున్న ఎన్జీవో ఆలోచన బాగుంది యాచకుల జీవితాలను మార్చటానికి మిశ్రాతో కలసి పనిచేయటానికి అంగీకరించింది. దీంతో వారణాసిలోని పలు ఘాట్ లలను పరిశీలించారు. వారికి ఎంతోమంది యాచకులు కనిపించారు. అలా మిశ్రా యాచకుల జీవితాల గురించి తెలుసుకోవటానికి వారితో పరిచం పెంచుకున్నారు. తన ఆలోచన గురించి చెప్పారు. మీరు ఇలా యాచన చేయనక్కరలేదు. మీకో మార్గం చూపుతాను..మంచి జీవితం ఏర్పడుతుందని చెప్పారు.కానీ యాచకులు ఎవ్వరు అంగీకరించలేదు. ఎన్ని విధాలుగా చెప్పినా మిశ్రా ఒక్క బిచ్చగాడిని కూడా ఒప్పించలేకపోయారు. కానీ పరిస్థితులే మార్పులు తీసుకొస్తాయన్నట్లుగా కోవిడ్ యాచకులకు మిశ్రా కార్పొరేషన్ అవసరం తెలిసొచ్చింది.

2021లో కోవిడ్ సెకండ్ వేవ్ లో లాక్ డౌన్ విధించిన సమయంలో బిచ్చగాళ్ల బతుకులు దుర్భరమైపోయాయి. దీంతో వారణాసిలో తమకు సాయం చేయాలంటూ ఎంతోమంది యాచకులు చంద్ర మిశ్రాను కోరారు. అలా ..తన పార్ట్ నర్స్ బద్రీనాథ్ మిశ్రా,దేవేంద్ర థాపాతో కలిసి మిశ్రా 2022 ఆగస్టులో బెగ్గర్స్ కార్పొరేషన్ ప్రారంభించారు. భర్తతో ఇంటి నుంచి గెంటివేయడిన ఓ మహిళ మిశ్రాను ఆశ్రయించగా ఆమెకు బ్యాగులు కుట్టే పని నేర్పించి ఉపాధి కల్పించారు. అలా యాచకులకు శిక్షణ ఇప్పించి వారు తయారు చేసే ఉత్పత్తులను మిశ్రా మార్కెటింగ్ చేయడం ప్రారంభించారు.

ఈ విషయం తెలిసిన ఎంతోమంది యాచకులు ఎన్నాళు ఇలా ముష్టెత్తుకుని బతుకుతాం.. ఇప్పటికైన జీవితాలను మెరుగుపరుచుకోవాలనుకున్నారు. యాచక వృత్తిని వదిలి చంద్ర మిశ్రా బెగ్గర్స్ కార్పొరేషన్ లో చేరడం మొదలు పెట్టారు. అలా 12 యాచక కుటుంబాలు బ్యాగులు తయారు చేస్తున్నాయి. మరో రెండు కుటుంబాలు దేవాలయాల వద్ద పూలు..పూజా సామగ్రి వంటివి అమ్ముకుంటు జీవిస్తున్నాయి.

రూ.10 నుంచి రూ.10,000 వరకు మీకు తోచినంత పెట్టుబడి పెట్టండీ..ఆరు నెలల్లో 16.5 శాతం వడ్డీతో చెల్లిస్తాం ఆ మొత్తంతో మీరు చిరు వ్యాపాలు చేసుకోవచ్చని ఈ చిన్నమొత్తం యాచకుల జీవితాల్లో మార్పులు తెస్తుందని చెబుతున్నారు. ఒక్కో యాచకుడికి సంబంధించి రూ.1.5 లక్షల పెట్టుబడి అవసరం అవుతుంది. అందులో రూ.50వేలతో నైపుణ్యాలపై ట్రైనింగ్ కు ఖర్చు పెడతాం..మరో రూ.లక్ష వారి వ్యాపారం ఏర్పాటుకు ఉపయోగిస్తాం అని తెలిపారు. కాగా..మిశ్రా బెగ్గర్స్ కార్పొరేషన్ తో పాటు వారణాశిలోని ఘాట్ లలో శివ-హనుమంతుల రూపంలో అడ్డుకునే పిల్లల కోసం స్కూల్ ఆఫ్ లైఫ్ ను కూడా ప్రారంభించారు. ఓరూ.10 రూపాయలు ముష్టి వేసి వెళ్లిపోవటం కంటే ఈ బెగ్గర్స్ కార్పొరేషన్ ద్వారా యాచకుల జీవితాలను మెరుగుపరటానికి చంద్ర మిశ్రా కృషి అభినందనీయమని పలు ఎన్జీవోలు అంటున్నాయి.