Ice Cream: హైదరాబాద్‌లో రూ.500కే 24K గోల్డ్ ఐస్‌క్రీమ్

దుబాయ్‌లో గోల్డ్ బిర్యానీ గురించి విన్నారు కదా.. అలాగే గోల్డ్ ఐస్ క్రీమ్.. అది కూడా హైదరాబాద్ లోనే. Huber & Holly అనే స్టాల్ లో 24క్యారెట్స్ గోల్డ్ ఐస్ క్రీమ్ రూ.500కే దొరుకుతుంది.

Ice Cream: హైదరాబాద్‌లో రూ.500కే 24K గోల్డ్ ఐస్‌క్రీమ్

Ice Cream

Ice Cream: దుబాయ్‌లో గోల్డ్ బిర్యానీ గురించి విన్నారు కదా.. అలాగే గోల్డ్ ఐస్ క్రీమ్.. అది కూడా మన హైదరాబాద్ లోనే. Huber & Holly అనే స్టాల్ లో 24క్యారెట్స్ గోల్డ్ ఐస్ క్రీమ్ రూ.500కే దొరుకుతుంది. ఈ ఫ్యాన్సీ ఐస్ క్రీమ్ పేరు మినీ మిదాస్. దీని ప్రిపరేషన్ తో సహా సోషల్ మీడియాలో ఫుడ్ బ్లాగర్ అభినవ్ జెస్వానీ పోస్టు చేయడంతో వైరల్ అయింది.

’24క్యారెట్ల గోల్డ్ ఐస్ క్రీమ్ హైదరాబాద్ లో దొరుకుతుంది. నేను తిన్న వాటిలో బెస్ట్ ఇదే. మీ ఫ్రెండ్స్ ను ట్యాగ్ చేసి ట్రీట్ ఇవ్వండి. హైదరాబాద్ లో ఉంటే మీరు కూడా ట్రై చేయండి. మీకు కచ్చితంగా ఇది నచ్చుతుంది’ అని క్యాప్షన్ లో పోస్టు చేశారు.

వీడియో పోస్టు చేసిన కొద్ది రోజుల్లోనే మూడు లక్షల లైకులు, 500కు పైగా కామెంట్లు వచ్చాయి.

ఇది కూడా చదవండి : ఇండియన్ ఆర్మీకి కొత్త యూనిఫామ్

గోల్డ్ ఐస్ క్రీమ్ ను గతేడాదే వీజే, ట్రావెల్ వ్లాగర్ షెనాజ్ ట్రెజరీ ఇంట్రడ్యూస్ చేశారు. గతంలో ఈమె బ్లాక్ డైమండ్ ఐస్ క్రీమ్ ను కూడా పోస్టు చేసింది.