Chandigarh University : పరీక్షల్లో సినిమా పాటల్ని సమాధానాలుగా రాసిన విద్యార్ధి .. ప్రొఫెసర్ అంతకుమించిన కామెడీ కామెంట్స్ వైరల్

పరీక్షల్లో సినిమా పాటల్ని సమాధానాలుగా రాసాడు ఓ విద్యార్ధి . మార్కులకు బదులుగా ప్రొఫెసర్ ఇచ్చిన కామెడీ కామెంట్స్ సోషల్ మీడియలో వైరల్ గా మారాయి.

Chandigarh University : పరీక్షల్లో సినిమా పాటల్ని సమాధానాలుగా రాసిన విద్యార్ధి .. ప్రొఫెసర్ అంతకుమించిన కామెడీ కామెంట్స్ వైరల్

Chandigarh University Student Writes movie Songs In Answer Sheet

Chandigarh University : పరీక్షల్లో ప్రశ్నాపత్రాలకు విద్యార్ధులు సమాధానాలు రాస్తారు. ఉపాధ్యాయులు మార్కులు వేస్తారు. కానీ చండీగఢ్ యూనివర్శిటీలో ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఓ విద్యార్ధి ప్రశ్నలకు సమాధానలు రాయకుండా సినిమా పాటలు రాసాడు. ఈ పరీక్ష పేపర్లు దిద్దిన ప్రొఫెసర్ సమాధానాలకు బదులు సినిమా పాటలు ఉండటంతో ముందుగా కాస్త షాక్ అయ్యారు. తరువాత విద్యార్ధే ఓ కామెడీ పర్సన్ అనుకుంటే సదరు ప్రొఫెసర్ అంతకు మించి అన్నట్లుగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సదరు యూనివర్విటీ నిర్వహించిన పరీక్షల్లో ఓ విద్యార్థి కేవలం మూడు ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు రాశాడు. కానీ అవి ఆ ప్రశ్నలకు సరైనవి కావు. సినిమా పాటలు రాసి నవ్వు తెప్పించాడు. మరి అది కామెడీ అనుకున్నాడో లేదా పరీక్షే కామెడీ అనుకున్నాడో గానీ..ఈ మూడింటిలో మొదటి ప్రశ్నలకు సూపర్ డూపర్ హిట్ సాధించిన ‘త్రీ ఇడియట్స్’ సినిమాలోని పాటను రాశాడు. రెండో ప్రశ్నకు సమాధానంగా ఈ పేపర్ ఎవరు కరెక్షన్ చేస్తారో తెలియదు గానీ అంటూ పేపర్ రాసినవారిని పొగిడేస్తూ ‘‘ మాడమ్ మీరు చాలా తెలివైన ఉపాధ్యాయులు..కానీ నేను మాత్రం హార్డ్ వర్క్ చేయలేకపోయాను సరిగ్గా చదవలేకపోయాను అది నాతప్పే ఒప్పుకుంటాను..కానీ నాకు దేవుడు టాలెంట్ ఇచ్చాడు అంటూ రాసుకొచ్చాడు. ఇక పోతే మూడో ప్రశ్నకు సమాధానంగా అమీర్ ఖాన్ నటించిన పీకే (PK) సినిమాలోని ‘భగవాన్‌ హై కహాన్‌ రే తూ’’ అనే పాట రాసాడు.

Viral Letter : నా భార్య అలిగింది సార్..బతిమాలుకోవటానికి సెలవు కావాలని కోరిన కానిస్టేబుల్.. ఐదు రోజులు సెలవిచ్చిన అధికారి

ఈ మూడింటిని చదవిన సదరు ప్రొఫెసర్ షాక్ అయ్యారు. విద్యార్థికి ఝలఖ్ ఇస్తూ..‘మీరు మరిన్ని సమాధానాలు రాయాలి (పాటలు) అని మీ టాలెంటూ ఆలోచన బాగానే ఉన్నాయి కానీ ఇక్కడ వర్కౌంట్ కావు‘టూ ఆన్సర్ షీటుపై కామెంట్ గా రాశారు. ఎందుకంటే సదరు కొంటె విద్యార్థి మొత్తం క్వశ్చన్ పేపర్ లో కేవలం మూడంటే మూడే ప్రశ్నలకు సమాధానాలు (పాటలు)రాశాడు. అంటే అన్ని ప్రశ్నలకు సమాధానంగా పాటలు రాయాలన్నట్లుగా కాస్త వెటకారంగా సదరు ప్రొఫెసర్ కామెంట్ వెరసి సదరు విద్యార్థి పాటల పేపర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..ఈ పేపర్

Viral letter : నా భార్య అలిగిపుట్టింటికి పోయింది బతిమాలుకోవాలి 10 రోజులు సెలవు కావాలని కోరిన ఎస్సై..