Delhi High Court to Flipkart: నాణ్యత లేని ప్రెజర్‌ కుక్కర్లను అమ్మినందుకు ఫ్లిప్‌కార్ట్‌ రూ.లక్ష జరిమానా కట్టాల్సిందే: ఢిల్లీ హైకోర్టు

 ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు ఢిల్లీ హైకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. నాణ్యత లేని ప్రెజర్‌ కుక్కర్లను అమ్మినందుకు జరిమానాగా కోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు రూ.లక్ష జమ చేయాలని ఇవాళ ఆదేశించింది. నాణ్యత లేని ప్రెజర్‌ కుక్కర్లను అమ్మినందుకు రూ.లక్ష జరిమానా చెల్లించాలని ఫ్లిప్‌కార్ట్‌ను కేంద్ర వినియోగదారు పరిరక్షణ ప్రాధికారిక సంస్థ (సీసీపీఏ) ఇంతకుముందు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ కేసులోనే సీసీపీఏకు అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది.

Delhi High Court to Flipkart: నాణ్యత లేని ప్రెజర్‌ కుక్కర్లను అమ్మినందుకు ఫ్లిప్‌కార్ట్‌ రూ.లక్ష జరిమానా కట్టాల్సిందే: ఢిల్లీ హైకోర్టు

Delhi High Court to Flipkart: ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు ఢిల్లీ హైకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. నాణ్యత లేని ప్రెజర్‌ కుక్కర్లను అమ్మినందుకు జరిమానాగా కోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు రూ.లక్ష జమ చేయాలని ఇవాళ ఆదేశించింది. నాణ్యత లేని ప్రెజర్‌ కుక్కర్లను అమ్మినందుకు రూ.లక్ష జరిమానా చెల్లించాలని ఫ్లిప్‌కార్ట్‌ను కేంద్ర వినియోగదారు పరిరక్షణ ప్రాధికారిక సంస్థ (సీసీపీఏ) ఇంతకుముందు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ కేసులోనే సీసీపీఏకు అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది.

అలాగే, తమ సైట్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ప్రమాణాలు కలిగిన కుక్కర్లను విక్రయించడం లేదన్న విషయాన్ని వినియోగదారులకు స్పష్టంగా తెలిసేలా పేర్కొనాలని చెప్పింది. ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ప్రమాణాలు కలిగిన కుక్కర్లను మాత్రమే విక్రయించాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా ఫ్లిప్‌కార్ట్‌ వ్యవహరించినట్లు సీసీపీఏ ఇప్పటికే తెలిపింది. అలాగే, ఫ్లిప్‌కార్ట్‌ విక్రయించిన 598 ప్రెజర్ కుక్కర్లను వినియోగదాల నుంచి తిరిగి తీసుకుని వారికి డబ్బులు తిరిగివ్వాలని చెప్పింది.

అలాగే, నిబంధనలు పాటిస్తున్నారా? అన్న విషయంపై 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని పేర్కొంది. 598 ప్రెజర్ కుక్కర్లను విక్రయించడంతో ఫ్లిప్ కార్ట్ రూ.1,84,263 పొందిందని చెప్పింది. కాగా, గతంలోనూ ఇదే విషయంలో అమెజాన్‌కు కూడా సీసీపీఏ రూ.లక్ష రూపాయలు జరిమానా విధించింది. 2,265 మంది కస్టమర్లనుంచి ప్రెజర్ కుక్కర్లను వెనక్కి తీసుకుని, డబ్బులు ఇచ్చేయాలని చెప్పింది.

Amit shah slams nitish kumar: ఇలాగైతే నితీశ్ బాబు దేశ ప్రధాని ఎలా కాగలరు?: అమిత్ షా