Unborn Twin In One Year Baby Brain : ఏడాది చిన్నారి మెదడులో పెరిగిన పిండం..! నాలుగు అంగుళాలు పిండానికి అవయవాలు, గోళ్లు..!!

ఏడాది చిన్నారి మెదడులో మరో పిండం పెరిగింది.నాలుగు అంగుళాలున్న ఆ పిండానికి అవయవాలు, గోళ్లు కూడా ఏర్పడిన వింత ఘటన చూసి డాక్టర్లు కూడా షాక్ అయ్యారు.

Unborn Twin In One Year Baby Brain : ఏడాది చిన్నారి మెదడులో పెరిగిన పిండం..! నాలుగు అంగుళాలు పిండానికి అవయవాలు, గోళ్లు..!!

Unborn Twin In One Year Baby Brain

Unborn Twin In One Year Baby Brain : అప్పుడే పుట్టిన చిన్నారి కడుపులో.. మరో పిండం ఉన్న వింత సంఘటన గురించి విన్నాం. కానీ చైనాలోని షాంఘై నగరంలో అంతకు మించిన వింత జరిగింది. ఏడాది వయస్సున్న ఓ చిన్నారి ‘మెదడు’లో ఓ పిండం పెరిగింది. చిన్నారి మెడదుడలో పెరిగిన నాలుగు అంగుళాల పిండం పెరిగింది. అంతేకాదు ఆ పిండానికి అవయవాలు కూడా ఏర్పడ్డాయి. గోళ్లు కూడా ఏర్పడ్డాయి. తలనొప్పితో బాధపడుతున్న చిన్నారిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకురావటంతో బిడ్డకు స్కానింగ్ తీసిన డాక్టర్లు ఆ చిన్నారి మెదడులో పెరిగిన పిండాన్ని చూసి షాక్ అయ్యారు…!!

బాధితన చిన్నారి తలలో సమస్యలతో బాధపడుతుండడం..తల్లిదండ్రులు న్యూరాలజిస్టుల వద్దకు తీసుకొచ్చారు. పాప తలనొప్పితో పాటు శరీరంలోని కండరాల్లో కదలికలు కూడా సరిగా లేకపోవడంతో డాక్టర్లు స్కానింగ్ చేయగా మెదడులో పిండాన్ని చూసి షాకయ్యారు. నాలుగు అంగుళాలు ఉన్న పిండానికి పలు అవయవాలతోపాటు వేళ్ల గోర్లు కూడా అభివృద్ధి చెందటం వారిని అమితంగా ఆశ్చర్యపరిచింది.

వింతల్లోనే వింత : అప్పుడే పుట్టిన చిన్నారి కడుపులో.. మరో బేబీ

శిశువు తల్లిగర్భంలో పెరుగుతున్నప్పుడే ఇలా జరిగి ఉంటుందని డాక్టర్లు భావిస్తున్నారు. కవల పిల్లల్లో ఒక పిండం ఎదిగి, మరో పిండం ఎదగకపోతే ఇలాంటి సమస్యలే వస్తాయని..అరుదైన ఘటనలో ఓ పిండం మరో పిండం శరీరంలోకి ప్రవేశించిన ఘటనలు జరుగుతుంటాయని డాక్టర్లు తెలిపారు. ఈ పాపకు జరిగిన ఈ అరుదైన కేసును ‘ఫీటస్ ఇన్ ఫీటు’ అంటారని తెలిపారు.

పిండాలు అభివృద్ధి చెందుతున్నప్పుడు విభజన సరిగా జరగకపోతే ఒక పిండం కడుపులోకి లేదా మరో ఇతర అవయవాల్లోకి లేదా మెదడులో మరో పిండం కలిసిపోతుందని ఈ చిన్నారి విషయంలో అదే జరిగి ఉంటుందని తెలిపారు. ఏడాది పాపకు ఫుడాన్ వర్సిటీలోని హుయాసన్ ఆసుపత్రి న్యూరో సర్జన్ డాక్టర్ జోంజే విజయవంతంగా శస్త్రచికిత్స చేసి మెదడులోని పిండాన్ని తొలగించారు.