Old School Bus: పాత స్కూల్ బస్సును ట్రిపుల్ బెడ్ రూంగా మార్చి 16రాష్ట్రాల్లో పర్యటన

వర్క్ ఫ్రమ్ హోం వచ్చింది కదా అని అద్దె ఇళ్లు ఖాళీ చేసి మనోళ్లంతా సొంతూళ్లకు వెళ్లిపోయి రిలాక్స్ గా గడిపేస్తున్నారు. పిల్లలకు స్కూల్స్ కూడా లేకపోవడంతో ఎటువంటి టెన్షన్ లేకుండాపోయింది

Old School Bus: పాత స్కూల్ బస్సును ట్రిపుల్ బెడ్ రూంగా మార్చి 16రాష్ట్రాల్లో పర్యటన

Old School Bus(1)

Old School Bus: వర్క్ ఫ్రమ్ హోం వచ్చింది కదా అని అద్దె ఇళ్లు ఖాళీ చేసి మనోళ్లంతా సొంతూళ్లకు వెళ్లిపోయి రిలాక్స్ గా గడిపేస్తున్నారు. పిల్లలకు స్కూల్స్ కూడా లేకపోవడంతో ఎటువంటి టెన్షన్ లేకుండాపోయింది. కామన్ గా ఆలోచించే వాళ్లంతా ఇలా వెళ్తుంటే.. బేసికల్‌గా టూరిజం ఇంటరెస్ట్ ఉన్న ఈ జంట మాత్రం డిఫరెంట్ గా వెళ్లారు. పిల్లలతో పాటు దాదాపు 16రాష్ట్రాల్లో ప్రయాణించారు. ఇదంతా ఏ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సాయంతో కాదు ఒక పాత స్కూల్ బస్ తోనే. వర్క్ ఫ్రమ్ హోమ్ కాస్తా వాళ్లకు మొబైల్ హోంలోనే జరిగిపోయింది.

ఎలిజబెత్ స్పైక్ తన పార్టనర్ స్పైక్ ఇద్దరు పిల్లలు అడ్వంచర్ చేయాలని అనుకున్నారు. దాని కోసం ప్లాన్ చేసిందే ఈ స్కూల్ పాత వాన్. అందులో మూడు బెడ్స్, ఒక కిచెన్, బాత్రూం కూడా ఏర్పాటు చేసుకున్నారు. 15వేల డాలర్లు ఖర్చు పెట్టి రెండు నెలలో ఏర్పాటు పూర్తి చేసుకుని జూన్ 2020లో ప్రయాణం మొదలుపెట్టారు.

‘మా పిల్లలతో కలిసి ప్రయాణించాలనుకున్నాం. ఎందుకంటే కొవిడ్ షట్ డౌన్ కావడంతో పిల్లలకు స్కూల్స్ సెలవులిచ్చేశారు. ఇంటి దగ్గర నుంచే పనిచేసే అవకాశం దొరకడంతో దీనిని పూర్తిగా వినియోగించుకోవాలనుకున్నాం. తాను చిన్నప్పుడు ఇలాగే మార్పులు చేసిన స్కూల్ బస్ గుర్తు చేసుకుని రీ డిజైన్ చేసేశాడు. దాని పెయింట్ మొత్తం తుడిచేసి.. గ్రీన్ కలర్ లో పెయింట్ వేసుకుని రూఫ్ కు వైట్ ప్యాచింగ్ చేశారు.

………………………………… : విక్టరీ సింబల్ చూపించిన సాయితేజ్

క్వీన్ సైజ్‌డ్ బెడ్.. దాని ఎదురుగా బంక్ బెడ్ ఏర్పాటు చేశారు. ఇంకా బాత్రూం, షవర్ రూం, స్మాల్ కిచెన్ ఏర్పాటు చేసుకుని ఎలక్ట్రికల్ స్టవ్ ఏర్పాటు చేసుకున్నారు. పిల్లల కోసం చిన్న సెటప్ కోసం కూడా రెడీ చేశారు బస్‌లో. ఈ ట్రిప్ మొత్తాన్ని వారు క్రియేట్ చేసుకున్న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

అలా వారు మొత్తం 16అమెరికన్ రాష్ట్రాల్లో ప్రయాణించారు. ఇంకా ఆన్ లైన్ క్లాసులు వినాల్సి వచ్చినప్పుడు పిల్లలు బస్ లోనే హోం వర్క్ పూర్తి చేసేవారని చెప్తున్నారు. ఇదంతా చేస్తున్నప్పుడు చాలా థ్రిల్లింగ్ గా అనిపించేదని ఆ జంట చెప్పుకొస్తున్నారు.