Honey Badger : చుట్టుముట్టి మూడు చిరుతల్ని చెడుగుడు ఆడేసిన చిన్నజీవి ..

హీనంగా చూడకు ఘోరంగా దెబ్బతింటామనే మాటను నిజం చేసి చూపించింది ఓ చిన్నప్రాణి. మూడు చిరుతల్ని చెడుగుడు ఆడేసి పలాయనం చిత్తగించేలా చేసింది. చుట్టుముట్టిన మూడు చిరుతలపై చుక్కలు చూపెట్టింది.

Honey Badger : చుట్టుముట్టి మూడు చిరుతల్ని చెడుగుడు ఆడేసిన చిన్నజీవి ..

Honey Badger Fights Leopards

Honey Badger : అదో చిన్న జీవి..చిన్నదే కదా..దీన్ని క్షణంలో గుటకాయస్వాహా చేసేద్దామనుకున్నాయి మూడు చిరుతలు. హీనంగా చూడకు ఘోరంగా దెబ్బతింటామనే మాటను నిజం చేసి చూపించింది ఓ చిన్నప్రాణి. మూడు చిరుతల్ని చెడుగుడు ఆడేసి పలాయనం చిత్తగించేలా చేసింది. చుట్టుముట్టిన మూడు చిరుతలపై తన శక్తికి మించి పోరాడి క్రూరజంతువులకు చుక్కలు చూపెట్టింది.

చిరుత పులి వేట గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. వాయువేగంతో పరుగెత్తే జింకను కూడా నోటకరిచి చెట్టుమీదకు ఈజీగా లాక్కుపోయి తాపీగా విందారగిస్తుంది. అటువంటివి మూడు చిరుతలను కలిస్తే ఏనుగునైనా అంతమొందించేస్తాయి. కానీ ఓ చిరుప్రాణిని మాత్రం ఏమీ చేయలేకపోయాయి. మూడు చిరుతలకు ఒకే ఒక్క చిన్నప్రాణి చుక్కలు చూపించిన వీడియోను ప్రముఖ ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా షేర్ చేశారు.

హనీ బాడ్జర్ అనే చిన్నజంతువు మూడు చిరుతలతో పోరాడిన ఈ వీడియోను చూస్తే చిన్నదే కదాని తక్కువ అంచనావేయొద్దు అనే మాట గుర్తుకొస్తుంది. మూడు చిరుతల్లో ఒకటి పెద్దది. మరో రెండు మరీ చిన్నవి కాదు అవికూడా పెద్దగానే ఉన్నాయి. హనీ బాడ్జర్ చిన్నదే అయినా శత్రువుల ముందు లొంగిపోదు. చిరుత పులులు కూడా దీన్ని ఏమీ చేయలేవు. పైగా ఏ జంతువును చూసినా ఇది ఏ మాత్రం భయపడిపోదు. ఎందుకంటే ఈ వీడియో చూస్తే తెలుస్తుంది అనేలా సుశాంత నందా తెలియజేశారు. హనీ బాడ్జర్ ఓ మూడు చిరుత పులులతో పోరాడుతున్న వీడియో క్లిప్ ను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

హనీ బాడ్జర్ అనేది భయమే లేని జంతువు. వాటి చర్మం చాలా మందంగా ఉంటుంది. పైగా చాలా లూజుగా కూడా ఉంటుంది. వాటి శరీర ఆకృతిని బట్టి చూస్తే అదే వాటినికి ప్లస్ పాయింట్. శత్రువుల నుంచి ప్రాణాలు కాపాడుకోవటానికి. క్రూర జంతువల దాడి నుంచి కూడా సునాయాసంగా తప్పించుకోగలవు. మెడ దగ్గర పట్టుకున్నా సరే అవి విడిపించుకోగలవు. పాముల విషం, తేళ్ల కాటుల నుంచి వీటికి రక్షణ ఉంటుంది అని వివరించారు సుశాంత నందా. మరీ మూడు చిరుతల్ని చెడుగుడు ఆడేసి చుక్కలు చూపించిన ఈ చిచ్చరపిడుగులాంటి హీనా బాడ్జర్ వీరత్వంపై పోరాట పటిమపై మీరు కూడా ఓ లుక్కేయండీ..ఈ వీడియో చూస్తే హనీ బాడ్జర్ కు శరీర నిర్మాణం ఎంత సేఫ్టీయో అర్థమవుతుంది..