Actor Chetan booked: ‘కాంతార’ సినిమాలోని ‘భూత కోల’పై అనుచిత వ్యాఖ్యలు.. సినీ నటుడిపై కేసు

ఈ సినిమా గురించి తాజాగా చేతన్ మాట్లాడుతూ... బ్రాహ్మణిజంలో గిరిజనుల సంస్కృతి కలిసిపోయిందని అన్నారు. అయితే, ఆ రెండూ విభిన్న రకాల సంస్కృతులని, ‘భూత కోల’ అనేది హిందూ సంస్కృతి కాదని చెప్పారు. దీంతో శివకుమార్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చేతన్ పై ఐపీసీ సెక్షన్ 505(2) కింద కేసు నమోదు చేశారు. చేతన్ చేసిన వ్యాఖ్యలు మతపర మనోభావాలను దెబ్బతినేలా, రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని రాజేసేలా ఉన్నాయని శివకుమార్ అన్నారు.

Actor Chetan booked: ‘కాంతార’ సినిమాలోని ‘భూత కోల’పై అనుచిత వ్యాఖ్యలు.. సినీ నటుడిపై కేసు

Actor Chetan booked: ‘కాంతార’ సినిమా ఘన విజయం సాధించిన వేళ ‘భూత కోల’పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కన్నడ నటుడు చేతన్ పై పోలీసులు కేసు నమోదుచేశారు. ఇటీవలే తెలుగులోనూ విడుదలై మంచి విజయాన్ని అందుకున్న కన్నడ సినిమా ‘కాంతార’లో భూత కోల నృత్యకారులను, వారి నృత్యాలను, వారి ఆచారాలను చూపించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా గురించి తాజాగా చేతన్ మాట్లాడుతూ… బ్రాహ్మణిజంలో గిరిజనుల సంస్కృతి కలిసిపోయిందని అన్నారు. అయితే, ఆ రెండూ విభిన్న రకాల సంస్కృతులని, ‘భూత కోల’ అనేది హిందూ సంస్కృతి కాదని చెప్పారు. దీంతో శివకుమార్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చేతన్ పై ఐపీసీ సెక్షన్ 505(2) కింద కేసు నమోదు చేశారు.

చేతన్ చేసిన వ్యాఖ్యలు మతపర మనోభావాలను దెబ్బతినేలా, రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని రాజేసేలా ఉన్నాయని శివకుమార్ అన్నారు. ఈ కేసులో విచారించేందుకు చేతన్ కు సమన్లు పంపుతామని పోలీసులు తెలిపారు. కాగా, చేతన్ కు ఇటువంటి వ్యాఖ్యలు చేసి, వివాదాల్లో ఇరుక్కోవడం కొత్తేం కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో హిజాబ్ విషయంలోనూ వివాదాస్పద ట్వీట్లు చేసి చిక్కుల్లో ఇరుకున్నారు.

https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw