Kerala : కొడుకు సమాధిపై క్యూఆర్ కోడ్.. ‘తనయుడి జ్ఞాపకాలు సజీవం’గా ఉండాలని ఓ తండ్రి వినూత్న ఆలోచన

కొడుకు సమాధిపై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసిన ఓ తండ్రి కొడుకు జ్ఞాపకాలు సజీవం’గా ఉండేలా చేసిన వినూత్న ఆలోచన వైరల్ గా మారింది.

Kerala : కొడుకు సమాధిపై క్యూఆర్ కోడ్.. ‘తనయుడి జ్ఞాపకాలు సజీవం’గా ఉండాలని ఓ తండ్రి వినూత్న ఆలోచన

Dr Ivin Francis QR code

Kerala : అది కేరళ (Kerala)లోని ఓ పెద్ద చర్చి. ఆ చర్చిని సందర్శించటానికి వచ్చినవారు అక్కడ ఉన్న ఓ సమాధిపై ఉన్న క్యూఆర్ కోడ్ (QR Code)ను చూసి ఆశ్చర్యపోతున్నారు. అదేంటీ సమాధిపై క్యూఆర్ కోడ్ ఉందేంటి? అని ఆశ్చర్యపోతుంటారు. అసలు విషయం తెలుసుకున్నాక భావోద్వేగానికి గురి అవుతున్నారు. ఈ క్యూఆర్ కోడ్ వెనుక ఓ తండ్రి కొడుకు జ్ఞాపకాలను పదిలం చేసుకున్న తీపి గుర్తు ఉందని తెలిస్తే ఆ తండ్రి చేసిన ఈ ఆలోచనకు హ్యాట్సాఫ్ చెబుతాం..

కేరళలోని త్రిస్సూర్‌ జిల్లా కురియాచిరా పట్టణంలోని సెయింట్‌ జోసెఫ్‌ చర్చికి సంబంధించిన ప్రాంతంలో ఉన్న ఓ సమాధి పలకపై పెద్ద సైజులో ఉన్న క్యూఆర్‌ కోడ్‌ ఓ తండ్రి తన 26 ఏళ్ల కొడుకు ‘గుర్తుకు సజీవం’ సాక్ష్యంగా కనిపిస్తోంది. 26 ఏళ్ల కొడుకు చనిపోతే ఆ కొడుకు జ్ఞాపకాలు సజీవం’గానే ఉండాలని ఓ తండ్రి తపన కనిపిస్తుంది. ఈ క్యూర్ కోడ్ ఓ యువ డాక్టర్ మరణానికి గుర్తే కాదు అతనిలోని మల్టీ టాలెంట్ కు గుర్తుగా నిలుస్తోంది. ఆ సమాధి 26 ఏళ్లకే చనిపోయిన డాక్టర్ ఐవిన్ ప్రాన్సిస్ ది.

ఒమన్ లోని ఓ ప్రైవటే కంపెనీలో అధికారి అయిన ప్రాన్సిస్ కుమారుడు 26 డాక్టర్ ఐవిన్ క్రీడల్లో కూడా చక్కటి ప్రావీణ్యం కలిగిన వ్యక్తి. ఐవిన్ 2021లో బ్యాడ్మింటన్ ఆడుతూ (Dr Ivin Francis) కుప్పకూలి చనిపోయాడు. దీంతో అతని తండ్రి ఫ్రాన్సిస్ తన కుమారుడి జ్ఞాపకాలు సజీవంగా ఉండాలని భావించి డాక్టర్‌ ఐవిన్‌ జీవిత విశేషాలు, అతడి సృజనాత్మక ప్రతిభ తాలూకు వీడియోలు చూసేందుకు వీలుగా ఈ క్యూఆర్ కోడ్ ను ఏర్పాటు చేసి దాన్ని డాక్టర్ వెబ్ సైట్ కు అనుసంధానం చేశారు.డాక్టర్ గా ఎంతో భవిష్యత్తు ఉన్న కుమారుడు చిన్న వయసులోనే తమకు దూరం కావడంతో తల్లడిల్లిన తల్లిదండ్రులు ఐవిన్‌ జ్ఞాపకాలు సజీవంగా ఉండాలన్న వినూత్న ఆలోచనలతో ఈ క్యూఆర్ కోడ్ ను అతని సమాధిపై ఏర్పాటు చేశారు.

డాక్టర్‌ ఐవిన్‌ జీవితంలోని ముఖ్య సంఘటనలను ఓ వెబ్‌ పేజీ రూపొందించిన అతడి కుటుంబం క్యూఆర్‌ కోడ్‌తో దాన్ని అనుసంధానం చేసింది. ఈ కోడ్‌ను స్కాన్‌ చేస్తే ఐవిన్‌ ఫోటోలు, కాలేజీలలో కీబోర్డు, గిటార్లతో ఇచ్చిన ప్రదర్శనలు, అతని స్నేహితుల వివరాలు అన్నీ చూసేలా ఏర్పాటు చేశారు.