Kerala : ఆ స్కూల్లో ఒకే ఒక్క విద్యార్థి .. పాఠాలు చెప్పటానికి 140 కిలోమీటర్లు ప్రయాణిస్తున్న టీచర్

ఆ స్కూల్లో ఒకే ఒక్క విద్యార్ది చదువుకుంటున్నాడు. ఆ విద్యార్దికి పాఠాలు చెప్పటానికి ఓ టీచర్ 70కిలోమీటర్లు ప్రయాణించి మరీ వస్తున్నారు ఓ ఉపాధ్యాయురాలు. అలా ఒక విద్యార్ది కోసం ఆమె రోజుకు 140 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. ఒక్క విద్యార్ది కోసం స్కూల్ నడుపుతోంది కేరళ ప్రభుత్వం.

Kerala : ఆ స్కూల్లో ఒకే ఒక్క విద్యార్థి .. పాఠాలు చెప్పటానికి 140 కిలోమీటర్లు ప్రయాణిస్తున్న టీచర్

One teacher One student in Kerala School

Kerala School One teacher One student : అది  ఒక స్కూల్.. ఒక టీచర్.. ఒక స్టూడెంట్.. అంతే. వింటుంటే.. కొత్తగా రాబోయే సినిమా స్టోరీలా అనిపించొచ్చు. కానీ.. ఇదే నిజం. విద్యార్థులు తక్కువగా ఉన్నారని.. చాలా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు.. పాఠశాలలను మూసివేస్తున్నాయ్. కానీ.. కేరళ సర్కార్ మాత్రం అలా చేయలేదు. ఆ స్కూల్‌ మొత్తంలో ఒకే ఒక్క స్టూడెంట్ ఉన్నా.. ఆ పాఠశాలను ఇంకా నడుపుతోంది.

 

10 మంది పిల్లలకు ఒకే టీచర్.. 20 మంది విద్యార్థులకు.. ఇద్దరే టీచర్లు.. ఇలాంటి వార్తలు చూసుంటారు. తర్వాత.. ఆ స్కూల్స్ మూతబడిపోతుంటాయ్. దేశంలో.. ఏ రాష్ట్రంలో అయినా.. ఇంతే. కానీ.. కేరళలో మాత్రం అలా కాదు. మీరు చూస్తున్న ఈ స్కూల్‌లో.. అటెండెన్స్ రిజిస్టర్ కూడా అవసరం లేదు. ఎందుకంటే.. ఇక్కడ చదివేది ఒకే ఒక్క విద్యార్థి. అతనొక్కడి కోసమే.. కేరళ ప్రభుత్వం ఈ పాఠశాలను నడుపుతోంది. కేరళలోని గిరిజన ప్రాంతంలో ఉన్న ఈ స్కూల్‌లో.. ఈ ఒక్క విద్యార్థి మాత్రమే ఉన్నాడు.

 

Govt School One Student : ఆ స్కూల్ లో ఒకే ఒక్క విద్యార్థి.. 12 కిమీ దూరం నుంచి వచ్చి చదువు చెబుతున్న టీచర్

కేరళలోని మాతోట్టు గ్రామంలో ఉన్న ఈ మారంగాడ్ గిరిజన లోయర్ ప్రైమరీ స్కూల్‌లో.. ఎస్పీ ప్రవీణ ఒక్కరే టీచర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఒక్క విద్యార్థికి చదువు చెప్పేందుకు.. ఆవిడ 70 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేసి వస్తారు. స్కూల్ ముగిశాక మళ్లీ 70 కిలోమీటర్ల మేర జర్నీ చేసి ఇంటికి వెళతారు. ఈ గిరిజన ప్రాంతంలో సుఖిల్ ఒక్కడే ఈ పాఠశాలలో చేరాడు. అతనిప్పుడు.. నాలుగో తరగతి చదువుతున్నాడు. కుటుంబ పరిస్థితుల వల్ల.. గతేడాది సుఖిల్ చాలా క్లాసులకు హాజరుకాలేకపోయాడు. కానీ.. ఇప్పుడు బాగా చదువుకుంటున్నాడు.

 

జిల్లా విద్యాశాఖ అధికారులు.. ఈ గిరిజన ప్రాంతంలోని చాలా కుటుంబాల దగ్గరకు వెళ్లి.. వారి పిల్లలను.. పాఠశాలకు పంపాల్సిందిగా చాలా సార్లు కోరారు. అయితే.. ఈ గిరిజన పాఠశాలలో.. ఉపాధ్యాయులకు తరచుగా బదిలీలు అవుతుండటంతో ఆందోళన చెందుతున్నామని చెబుతున్నారు. అందువల్లే.. తమ పిల్లలను పాఠశాలలో చేర్పించేందుకు వెనుకాడుతున్నామని.. విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇకపై.. ఈ మరంగడ్ స్కూల్ అలాంటి సమస్య ఎదుర్కోదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

 

కొత్తగా.. ఎల్.కె.జి.లో నలుగురు విద్యార్థులు చేరారు. వారు.. నాలుగో తరగతి దాకా ఇక్కడే చదువుకునే అవకాశం ఉంది. ఇటీవలే.. టీచర్, స్టూడెంట్, కొందరు పూర్వ విద్యార్థులు, మాజీ ప్రిన్సిపల్.. కేరళలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనందున.. పాఠశాల రీఓపెనింగ్ సెర్మనీని జరుపుకున్నారు. ఒక్క విద్యార్థి కోసం.. కేరళ ప్రభుత్వం స్కూల్‌ని మూసేయకుండా.. రన్ చేస్తుండటం మంచి పరిణామంగా చెబుతున్నారు.