World Heaviest Bicycle : ప్రపంచంలోనే బరువైన సైకిల్ .. ముందుకెళ్లాలంటే 35 గేర్లు, వెనక్కెళ్లాలంటే 7 గేర్లు మార్చాల్సిందే..

ప్రపంచంలోనే అత్యంత భారీ, బరువైన సైకిల్ అది. ఆ భారీ సైకిల్ ను చూస్తే ఇది సైకిలా? బుల్డోజరా? అనిపిస్తుంది. ఈ సైకిల్ ముందుకెళ్లాలంటే 35 గేర్లు, వెనక్కెళ్లాలంటే 7 గేర్లు మార్చాలి..ఈ భారీ సైకిల్ గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసింది.

World Heaviest Bicycle : ప్రపంచంలోనే బరువైన సైకిల్ .. ముందుకెళ్లాలంటే 35 గేర్లు, వెనక్కెళ్లాలంటే 7 గేర్లు మార్చాల్సిందే..

World Heaviest bicycle..Kleine Johanna

World Heaviest bicycle: ప్రపంచంలోనే అత్యంత భారీ, బరువైన సైకిల్ అది. ఆ భారీ సైకిల్ ను చూస్తే ఇది సైకిలా? బుల్డోజరా? అనే అనుమానం కలుగుతుంది. ఆ సైజులో ఉంటుందీ సైకిల్. సాధారణంగా సైకిళ్లకు గేర్లు ఉండవు. కానీ ఈ భారీ సైకిల్ ముందుకు వెళ్లాంటే 35 గేర్లు, వెనక్కి వెళ్లాలంటే మరో 7 గేర్లు వేయాలి. లేదంటే కదిలేదేలేదంటుంటుంది. ఈ భారీ సైకిల్ టైర్లు కూడా భారీగానే ఉంటాయి. ట్రాక్టర్ టైర్లంత భారీగా ఉంటాయి. ముందు ఒక భారీ టైరు, వెనుక మరో భారీ టైరుతోపాటు పక్కన అదనంగా మరో నాలుగు టైర్లు ఉంటాయి. మరి ఇన్ని టైర్లు ఉన్నదాన్ని పైగా పక్కన (సైడ్ టైర్స్) ఉంటే దాన్ని సైకిల్ అని ఎందుకంటారు అని అనే అనుమానం కూడా రాకమానదు. అలా ఉంటుందీ వింత భారీ, బరువైన సైకిల్..

జర్మనీలోని డుసెల్డోర్ఫ్‌లో ఇటీవల నిర్వహించిన ‘సైక్లింగ్‌ వరల్డ్‌ బైక్‌ షో’లో ‘క్లైన్‌ జొహన్నా’ అనే సైకిల్‌ వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దాని సైజుతో పాటు దాని ప్రత్యేకతలు తెలిసి వారెవ్వా ఇది సైకిలా? బుల్డోజరా? అని ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈ బుల్డోజర్ లాంటి సైకిల్ బరువు 2,177 కిలోలు..!

ఇనుప సామాన్ల వ్యర్ధాల నుంచి తెచ్చిన వస్తువులతో ఈ భారీ సైకిల్ ను తయారు చేశారు సెబాస్టియన్‌ అనే వ్యక్తి. సెబాస్టియన్ 10 నుంచి స్క్రాప్ తో వాహనాలను తయారు చేస్తుంటారు.అలా ఇనుము పరికరాల వ్యర్ధాలతో 5 మీటర్ల పొడవు, 2 మీటర్ల ఎత్తు కలిగిన ఈ భారీ సైకిల్ ను రూపొందించారు. ముందు, వెనుక వైపు కలిసి రెండు భారీ టైర్లు, మధ్యలో ఒక మీడియం టైర్లనును అమర్చారు. ఈ సైకిల్‌ కదలటానికి ఒక ట్రక్ గేర్‌ బాక్సు, సాధారణ గేర్‌ సైకిల్‌ వ్యవస్థతో అనుసంధానించారు. ఆల్టర్నేటర్‌ తిరగడానికి మాత్రమే సహాయం చేసే ఓ ఇంజిన్‌ కూడా ఉందీ సైకిల్ కు. ఈ బుల్డోజర్ లాంటి సైకిల్ ముందుకు కదలాలంటే 35 గేర్లు, వెనక్కి వెళ్లాలంటే ఏడు గేర్లు వేయాల్సిందే. లేదంటే కదలనే కదలదు.

ఈ భారీ సైకిల్ భారీ వాహనాలను కూడా లాగే శక్తి ఉంది. 15 టన్నుల బరువైన వాహనాలను కూడా సునాయాసంగా లాగేయగలదు? ఈ 2వేల 177 కిలోల బరువైన వాహనం..ఈ వింత భారీ సైకిల్ రూపకర్త పేరు పెబాస్టియన్. సాధారణంగా ఇటువంటి వాహనాలను రోడ్డుపైకి తెచ్చి ఎక్కడికైనా ప్రయాణించటం అంటే అంత ఈజీ కాదు. కానీ ఈ సైకిల్‌ ని తయారు చేసిన సెబాస్టియన్ మాత్రం దీనిపై 389 కిలోమీటర్ల ప్రయాణించటానికి రెడీగా ఉన్నారు. ఈ సైకిల్ పై బాల్టిక్‌ సముద్రం ప్రయాణానికి సెబాస్టియన్‌ రెడీ అవుతున్నారు. 389 కిలోమీటర్ల ప్రయాణించటానికి ఒక నెల సమయం పడుతుందని సెబాస్టియన్ అంచనావేస్తున్నారు.

ఈ భారీ సైకిల్ తయారు చేయటానికి సెబాస్టియన్ కు మూడేళ్లు పట్టింది. సుమారు 2500గంటల సమయం కేటాయించారు దీన్ని తయారు చేయటానికి. ఇటువంటి ఓ వింత వాహనం తయారు చేసే సెబాస్టిన్ ను కుటుంబ సభ్యులు, స్నేహితులు వారించారు. కానీ ప్రపంచంలోనే అత్యంత భారీ, బరువైన సైకిల్ ను తయారు చేసినందుకు నేను గర్విస్తున్నానని చెబుతున్నారు సెబాస్టియన్..ఇన్ని ప్రత్యేకలు ఉన్న ఈ భారీ సైకిల్ ఇన్ స్టిట్ూట్ ఫర్ జర్మనీ ద్వారా ప్రపంచంలోనే అత్యంత బరువైన సైకిల్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది.