Kurnool Diamonds Hunt : కర్నూలులో వజ్రాల వేట షురూ .. రైతుకు దొరికిన వజ్రం, రూ. రెండు కోట్లకు కొనుగోలు చేసిన వ్యాపారి

రతనాల సీమ రాయలసీమలో తొలికరి పలకరించింది. ఓ రైతు పంట పండింది. ఓ విలువైన వజ్రం దొరికింది. రైతు ఆనందం మిన్నంటింది. రెండు కోట్ల వజ్రం దొరకటంతో ఆ రైతు ఇంట ఆనందం వెల్లివిరిసింది.

Kurnool Diamonds Hunt : కర్నూలులో వజ్రాల వేట షురూ .. రైతుకు దొరికిన వజ్రం, రూ. రెండు కోట్లకు కొనుగోలు చేసిన వ్యాపారి

Diamonds Hunt in Kurnool

Diamonds Hunt in Kurnool Andhra Pradesh: తొలకరి జల్లులు పడితే చాలు ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమలో రత్నాలు కనిపించి కనువిందు చేస్తాయి. రాత్రికి రాత్రే కూలీలను సైతం కోటీశ్వరుల్ని చేస్తాయి. ముఖ్యంగా తొలకరి జల్లులు పడితే ఆ వర్షానికి కర్నూలు జిల్లాలో వజ్రాలు వెలుగులు విరబూస్తాయి. తమ అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి…కళ్లు కాయలు కాసేలా ఎంతోమంది ఈ తొలకరి జల్లుల కోసం ఎదురు చూస్తుంటారు. అలా జల్లులు పడగానే పరుగులు పెడతారు వజ్రాల వేట కోసం. తెల్లవారు ఝామునే మొదలుపెడతారు వజ్రాల వేట..రాత్రి అయ్యేవరకు అణువణువును తమ చేతులతో గాలిస్తారు.ఓ చిన్న మెరుపు కనిపిస్తే చాలు అది వజ్రమేమో అని ఆశగా దాన్ని చేతుల్లోకి తీసుకుంటారు. అది నిజంగా వజ్రమే అయితే ఇక వారి పంట పండినట్లే..అది లక్షల ధర పలకొచ్చు..తమ జీవితాలు మారిపోవచ్చు..

 

అదే ఆశతో తొలకరి జల్లుల కోసం ఎదురు చూస్తుండా పడనే పడ్డాయి..అలా కర్నూలు జిల్లాలో వజ్రాల వేట మొదలైంది. ఓ వ్యక్తికి ఓ వజ్రం లభ్యమైంది. అంతే అతని ఆనందం అంతా ఇంతా కాదు. నా అదృష్టం పండింది అంటూ ఒకటే సంబరపడిపోయాడు. మద్దికెర మండలం బసినేపల్లే గ్రామంలో ఓ రైతుకు ఓ విలువైన వజ్రం దొరికింది.

 

ఎవరో వజ్రం దొరికిందంట అని వార్తతో అక్కడికి వాలిపోతారు వజ్రాల వ్యాపారులు. గుట్టు చప్పుడు కాకుండా బేరం మాట్లాడేసుకుని అంతో ఇంతో చేతిలో పెట్టి ఆ వజ్రాన్ని దక్కించుకోవటానికి ఎత్తులు వేస్తారు.అలా వజ్రాన్ని దక్కించుకున్న ఆ రైతు వద్ద వాలిపోయారు వజ్రాల సిండికేట్లు. మూడో కంటికి తెలియకముందే ఆ వజ్రాన్నికొనుగోలు చేసేశారు. వజ్రాన్ని రెండు కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారని సమాచారం. ఈ సంవత్సరం తొలకరి వర్షాలకి విలువైన వజ్రం లభ్యం కావటంతో తొలకరి పడగానే సదరు రైతుని వజ్రం రూపంలో అదృష్టం దక్కిందని సంబరపడిపోతున్నాడు.

 

తొలకరి పడిందంటే అన్నదాతలు వ్యవసాయ పనులు మొదలుపెడతారు. సాగుకు ఏర్పాట్లు చేస్తుంటారు. కానీ కర్నూలు జిల్లాలో మాత్రం తొలకరి తర్వాత చిన్నాపెద్దా తేడా లేకుండా జనం పొలాల బాట పడతారు. తెల్లవారకుండానే వజ్రాల వేట కోసం పొలాల్లో వాలిపోతారు. రాయలసీమలోని పలు జిల్లాల్లో ఏటా వర్షాకాలం తొలకరితో ప్రారంభమవుతుంది ఈ వజ్రాల వేట. ముఖ్యంగా వజ్రకరూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఏటా కొంతమంది రైతుల దశ తిరిగి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతుంటారు. అలా ఓ రైతు పంట పండింది. ఓ విలువైన వజ్రం దొరికింది. ఈ ప్రాంతాల్లో కేవలం కర్నూలు జిల్లావాసులే కాదు ఎక్కడెక్కడినుంచో జనాలు వస్తారు. వజ్రాల వేట సాగిస్తారు. అదృష్టం బాగుంటే కోటీశ్వరులవుతుంటారు. వర్షాకాలం ప్రారంభంలో వజ్రం దొరికొందోచ్ అనే మాటలు రతనాల సీమ రాజయసీమలో వినిపిస్తుంటాయి.