Graveyard Restaurant : శ్మశానంలో రెస్టారెంట్, సమాధుల మధ్యే ఫుడ్ సర్వింగ్ .. మన భారత్‌లోనే..!

"జీవితం మరియు మరణం యొక్క అనుభూతిని"అందించే రెస్టారెంట్. శ్మశానంలో ఉంటుంది.సమాధుల మధ్యలో కూర్చుని తినటం, తాగటం ఓ వింత అనుభూతిని కలిగించే వినూత్న రెస్టారెంట్ మన భారత్ లోనే..

Graveyard Restaurant : శ్మశానంలో రెస్టారెంట్, సమాధుల మధ్యే ఫుడ్ సర్వింగ్ .. మన భారత్‌లోనే..!

graveyard restaurant

Graveyard Restaurant : అదో రెస్టారెంట్. కానీ శ్మశానం మధ్యలో ఉంటుంది. సమాధుల పక్కనే టేబుల్స్, కుర్చీలు ఉంటాయి. సర్వర్లు మన ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ తీసుకొచ్చి టేబుల్స్ పై పెడతారు. సమాధుల మధ్యే కూర్చుని తినటం, తాగటం ఆ రెస్టారెంట్ ప్రత్యేకత. పైగా దాంట్లో ఫుడ్ మంచి ఫేమస్ కూడా. ఇక్కడ దొరికే బన్ మస్కా, టీ టేస్ట్ చూసేకే మిగిలిన పనులకు వెళతారు అంటే ఈ శ్మశానం హోటల్ కు ఎంత డిమాండ్ ఉంటుందో ఊహించుకోవచ్చు. శ్మశానంలో రెస్టారెంట్, సమాధుల మధ్యే కూర్చుని టీలు తాగుతు స్నాక్స్ తింటే ఎలా ఉంటుందో ఊహించుకోవానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇక్కడే అదే ఫేమస్. ఇదేదో వేరే దేశంలో కాదు. మన భారతదేశంలోనే ఉంది. వినడానికి వింతగా ఉన్నా..శ్మశానం మధ్యలో హోటల్ మన ఇండియాలోనే ఉంది. ఇదేదో.. కొత్త థీమ్ రెస్టారెంట్ కాదు. అచ్చమైన శ్మశానంలోనే ఉంటుందీ హోటల్. కొన్ని దశాబ్దాలుగా అలాగే ఉంది.

 

టూరిస్టులను ఆకర్షిస్తున్న సమాధుల రెస్టారెంట్..
ఆ సమాధుల రెస్టారెంట్ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని లాల్ దర్వాజా ప్రాంతంలో ఉంది. దీని పేరు ‘లక్కీ రెస్టారెంట్’. చావు, బతుకుల మధ్య జీవితం అంతా ఓ జగన్నాటకం అని ఓ కవి అన్నారు. కానీ జీవితంలో తిండీ నిద్రా అంతా ఓ భాగం. కానీ అదే భాగంగా శ్మశానంలో ఉంటే ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవించవచ్చు ఈ వినూత్న హోటల్ లో.. ఈ కొత్త లక్కీ రెస్టారెంట్‌లో.. మొత్తం 26 సమాధులున్నాయ్. వాటికి.. 70 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. ఈ రెస్టారెంట్‌ని 1950లో స్థాపించారు. అప్పుడిది ఓ శ్మశానవాటికగా ఉండేది. నిజం చెప్పాలంటే.. ఈ హోటల్ శ్మశాన వాటికలోనే నిర్మించారు. ఈ రెస్టారెంట్‌ని నిర్మించేటప్పుడు సమాధులను క్లియర్ చేయడానికి బదులుగా.. అప్పటి యజమాని.. ఐరన్ ఎన్‌క్లోజర్లతో కంచె వేయించారు. తర్వాత.. వాటి చుట్టూ టేబుల్స్ వేశారు.

Unique Samosa shop : ఆ సమోసా షాపు పేరు ‘నమ్మకద్రోహం’.. పేరు వెనుక కథా.. ఆ సమోసాల రుచి భలే ఇంట్రెస్టింగ్

సమాధుల మధ్య మా బిజినెస్ చేయటం అదృష్టమంటున్న హోటల్ నిర్వాహకులు
ఈ హోటల్‌లో.. 26 సమాధులతో పాటు ఓ చెట్టు, పొద కూడా ఉంటుంది. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే టూరిస్టులు.. ఈ సమాధులను చూసి ఆశ్చర్యపోతారు. శ్మశానంలో హోటల్ నిర్మించారేంట్రా బాబూ అని.. వింతగా ఫీలవుతారు. ఈ సమాధుల మధ్యే.. టీ, కాఫీలు తాగేస్తారు. మొట్టమొదటిసారి ఈ హోటల్ చూసినప్పుడు కాస్త వింతగా అనిపించినా.. ఇక్కడ దొరికే ఫుడ్‌ని మాత్రం పబ్లిక్ ఎంజాయ్ చేస్తారు. అహ్మదాబాద్‌లోని పాలికా మార్కెట్ షాపింగ్ చేసేందుకు వచ్చే వాళ్లంతా.. మొదటగా ఈ లక్కీ హోటల్‌కే వస్తారు. ఇక్కడ దొరికే బన్ మస్కా, టీ టేస్ట్ చేశాకే.. మిగతా పనులు చూసుకుంటారు. ఇదేదో ఇప్పుడు కొత్తగా జరుగుతున్నది కాదు.. కొన్నేళ్లుగా.. ఇది నడుస్తోంది. కొంతమంది కస్టమర్లు.. ఈ హోటల్‌కి వచ్చినప్పుడు చాలా కొత్తగా అనిపిస్తుందని చెబుతున్నారు. హోటల్ సమాధుల మధ్య ఉంటుంది కాబట్టి.. శ్మశానం వాతావరణం ఏమీ కనిపించదు. ఇక్కడి పరిసరాలన్నీ చాలా శుభ్రంగా ఉంటాయి. క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంటుంది. ఈ సమాధులే.. రెస్టారెంట్‌కి ప్రత్యేకమైన గుర్తింపుని తీసుకొస్తాయని ఓనర్ నమ్ముతున్నారు. అంతేకాదు.. ఆ సమాధులే.. తమ బిజినెస్‌కు అదృష్టంగానూ భావిస్తున్నారు.

 

ప్రముఖ చిత్రకారుడు MF హుస్సేన్ మనసు దోచుకున్న హోటల్
ఈ శ్మశానం రెస్టారెంట్ ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ప్రముఖ చిత్రకారుడు MF హుస్సేన్ కు మనసు దోచుకున్న హోటల్ కూడా.  ఈ హోటల్ లో టీ తాగటానికి ఎంఎఫ్ హుస్సేన్ ఎంతో ఇష్టపడేవారట.ఆ విషయాన్ని హోటల్ మేనేజర్  తెలిపారు. హుస్సేన్ అహ్మదాబాద్ ను సందర్భించిన ప్రతీసారి ఈ హోటల్ కు తప్పనిసరిగా వచ్చేవారట. ఇక్కడ టీ తాగటం అంటే ఎంతో ఇష్టపడేవారని తెలిపారు. ఎంఎఫ్ హుస్సేన్ ఈ హోటల్ గురించి ఓ ఇంటర్వ్యూల్లో స్వయంగా వెల్లడించారు. ఆ హోటల్ లో టీ తాగటం “జీవితం మరియు మరణం యొక్క అనుభూతిని” అందించిందని తెలిపారు. ఈ హోటల్ లో MF హుస్సేన్ పెయింటింగ్స్ ను ప్రధాన ఆకర్షణగా ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఆయన మా కస్టమర్ అని చెప్పుకోవటానికి గర్వపడతామని తెలిపారు.