Viral Pic: ఫొటోలోని అమ్మాయి పొడవును కొలవడానికి త్రికోణమితి సూత్రాలను వాడిన యువకుడు

ఆ యువతి ఫొటో చుట్టూ త్రికోణమితి సూత్రాలను, పొడవు కొలవడానికి త్రికోణమితి పద్ధతిని గీసి మరీ ఆ అమ్మాయి పొడవు ఎంతో ఊహించాడు ఆ ట్విట్టర్ యూజర్. చివరకు, ఆమె పొడవు 5 అడుగుల 4.5 అంగుళాలని తాను అనుకుంటున్నట్లు చెప్పాడు. అతడు త్రికోణమితి సూత్రాలను వాడి ఈ విధంగా రిప్లై ఇవ్వడంతో ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

Viral Pic: ఫొటోలోని అమ్మాయి పొడవును కొలవడానికి త్రికోణమితి సూత్రాలను వాడిన యువకుడు

Trigonometry

Viral Pic: త్రికోణమితి.. గణితశాస్త్రంలో విద్యార్థుల బుర్ర తినే చాప్టర్. చాలా మంది విద్యార్థులు త్రికోణమితిని అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడుతుంటారు. త్రికోణమితిని ఖగోళాన్ని అధ్యయనం, భారీ భవనాల నిర్మాణ కొలతలు, సముద్రంలో నౌకా మార్గం నిర్ధారణ వంటి వాటి కోసం వాడుతుంటారు. అయితే, ఆయా రంగాల ఇంజనీర్లకు మాత్రమే త్రికోణమితి ఉపయోగపడుతుందని, వేరే ఉద్యోగాలు చేసేవారికి అది ఉపయోగపడదని, ఇక నిత్యజీవితంలో దాని అవసరమే ఉండదని అనుకుంటాం.

అయితే, ఓ వ్యక్తి చాలా తెలివిగా త్రికోణమితిని ఓ అమ్మాయి పొడవు కొలవడానికి వాడి అందరి దృష్టినీ ఆకర్షించాడు. పల్లవి పాండే అనే ట్విట్టర్ యూజర్ తన పొడవు ఎంతో చెప్పుకోండి అంటూ మెట్ల వద్ద నిలబడి ఫొటోను పోస్ట్ చేసింది. చాలా మంది ఆమె పొడవును ఊహించి సమాధానాలు చెప్పారు. అయితే, మిస్టర్ నో బడీ పేరుతో ఉన్న ఓ ట్విట్టర్ ఖాతా నుంచి వచ్చిన సమాధానానికి అందరూ ఆశ్చర్యపోయారు.

ఆ యువతి ఫొటో చుట్టూ త్రికోణమితి సూత్రాలను, పొడవు కొలవడానికి త్రికోణమితి పద్ధతిని గీసి మరీ ఆ అమ్మాయి పొడవు ఎంతో ఊహించాడు ఆ ట్విట్టర్ యూజర్. చివరకు, ఆమె పొడవు 5 అడుగుల 4.5 అంగుళాలని తాను అనుకుంటున్నట్లు చెప్పాడు. అతడు త్రికోణమితి సూత్రాలను వాడి ఈ విధంగా రిప్లై ఇవ్వడంతో ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

Giza pyramid : 4,500 ఏళ్ల నాటి గిజా పిరమిడ్‌లో 30 అడుగుల సొరంగం గుర్తింపు..ఇక సమాధుల సీక్రెట్ వీడేనా?