Marriage in Burial Ground : శ్మశానంలోనే పెళ్లి..విందు భోజనాలు కూడా అక్కడే

పెళ్లి అంటే శుభకార్యం. చావు అంటే అశుభం అంటారు. కానీ చావు జరిగిన చోటు శుభకార్యం జరగాలంటారు పెద్దలు. కానీ చావుకు కేరాఫ్ అడ్రస్ అయిన శ్మశానంలో శుభకార్యాలు చేయరు. కానీ ఓ గ్రామంలో మాత్రం శ్మశానమే ఓ అమ్మాయికి వెళ్లి వేదిక అయ్యింది. అశుభంగా భావించే శ్మశానంలో ఓ అమ్మాయి పెళ్లి జరిగింది.

Marriage in Burial Ground : శ్మశానంలోనే పెళ్లి..విందు భోజనాలు కూడా అక్కడే

Marriage in Burial ground punjab

Marriage in Burial Ground : పెళ్లి అంటే శుభకార్యం. చావు అంటే అశుభం అంటారు. కానీ చావు జరిగిన చోటు శుభకార్యం జరగాలంటారు పెద్దలు. కానీ చావుకు కేరాఫ్ అడ్రస్ అయిన శ్మశానంలో శుభకార్యాలు చేయరు. కానీ ఓ గ్రామంలో మాత్రం శ్మశానమే ఓ అమ్మాయికి వెళ్లి వేదిక అయ్యింది. అశుభంగా భావించే శ్మశానంలో ఓ అమ్మాయి పెళ్లిని అంగరంగ వైభోగంగా జరిపారు ఆ గ్రామ ప్రజలు అందరు కలిసి. అదేంటీ శ్మశానంలో పెళ్లా? ఇదేదో వెరైటీగా ఉందే అనుకుంటున్నారు కదూ..కానీ ఈ పెళ్లి ఏదో వైరల్ అవ్వటానికో జరిగింది కాదు. వధువు పరిస్థితి అటువంటిది. కానీ ఏది ఏమైనా శ్మశానంలో పెళ్లి అంటే వైరల్ అవ్వకుండా ఎలా ఉంటుంది అందుకే పంజాబ్ లోని ఓ గ్రామంలో శ్మశానంలో జరిగిన ఓ పెళ్లి వైరల్ గా మారింది..

పంజాబ్‌లోని మొహ్కంపుర గ్రామంలోని శ్మశానానికి సమీపంలో.. ఓ వృద్ధురాలు ఆమె మనవరాలితో కలిసి జీవిస్తోంది. వారి ఎటువంటి ఆస్తులు లేవు. మనుమరాలికి పెళ్లి చేయాల్సిన బాధ్యత ఆ వృద్ధురాలిపైనే ఉంది. కానీ కొద్దిపాటి ఆస్తి కూడా లేకుండా మనుమరాలి పెళ్లి ఎలా చేయాలా? అని ఆమె మధనపడేది. దీంతో వేరే దారి లేక గ్రామస్థుల సాయం కోరింది. మనుమరాలి వివాహం చేయాలి సహాయం చేయండీ అని కోరింది. ఆమె పరిస్థితి తెలిసిన గ్రామపెద్దలు ఆ యువతికి పెళ్లి సంబంధాలు చూశారు.

అంతేకాదు అందరూ తలా ఇంతా వేసుకుని వివాహం జరిపించాలనుకున్నారు. అలా ఊరంతా కలిసి పెళ్లి ఖర్చులకు డబ్బులు సేకరించారు. పెళ్లి చేయటానికి స్థలం కోసం చూశారు. కానీ ఎక్కడా దొరకలేదు. దీంతో శ్మశానంలోనే జరిపించాలని నిర్ణయించారు. అలా శ్మశానంలోనే పెళ్లి జరిపించారు. విందు భోజనాలు కూడా అక్కడే ఏర్పాటు చేశారు. ఇలా శ్మశానంలో జరిగిన పెళ్ళి అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.