Mukesh Ambani : అంబానీ కోడలా మజాకా? ఆమె హ్యాండ్ బ్యాగ్ ధర ఎంతో తెలుసా?

అంబానీ కాబోయే కోడలు హ్యాండ్ బ్యాగ్ ధర ఎంతో తెలుసా? సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది..

Mukesh Ambani : అంబానీ కోడలా మజాకా? ఆమె హ్యాండ్ బ్యాగ్ ధర ఎంతో తెలుసా?

Mukhesh Ambani daughter-in-law Radhika Merchant Hand Bag Worth Rs. 52.30 Lakhs

Mukesh Ambani : ముఖేష్ అంబానీ. అపరకుబేరుడు. వారి ఇంట్లో ఏ ఈవెంట్ జరిగినా వారి స్థాయికి తగినట్లుగానే దర్పంగా గ్రాండ్ గా ఉంటుంది. ఎంగేజ్ మెంట్..వివాహాలు అయితే ఇక చెప్పనే అక్కర్లేదు. ఇక ముంబై నగరం అంతా సందడే సందడిగా మారిపోతుంది. అంబానీ భార్య నీతా అంబానీ నిర్వహించే వేడుకలు కూడా అలాగే ఉంటాయి. నీతా అంబానీ ఇచ్చే గిఫ్ట్ లు కూడా ఆరేంజ్ లోనే ఉంటాయంటారు సన్నిహితులు. ముఖ్యంగా నీతా అంబానీ కట్టుకునే చీరలు, ధరించే నగలు కూడా ప్రత్యేక డిజైన్ తో చేయించుకున్నవే ఉంటాయి. అలాగే నీతా అంబానీ వినియోగించే హ్యాండ్ బ్యాగులు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. మరి అటువంటి కుటుంబానికి కోడలు అంటే వారి రేంజ్ కూడా ఏమాత్రం తగ్గకుండే కాస్త పెంచేలానే ఉంటుంది కదా..

అంబానీకి కాబోయే కోడలు కట్టుకునే చీరలు, ధరించే నగలే కాదు ఆమె వినియోగించే హ్యాండ్ బ్యాగ్ ధర సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రిలయన్స్ ట్రస్ట్ ద్వారా నీతా అంబానీ చేపట్టే కార్యక్రమాల్లో భాగంగా కళలు, సాంస్కృతిక కార్యక్రమాలపై మక్కువ ఎక్కువ ఉన్న ఆమె తన కలల ప్రాజెక్టు నీతా ముఖేష్ అంబానీ కల్చర్ సెంటర్ (NMAC) ను ప్రారంభించారు. ఈ NMAC ప్రారంభోత్సవ కార్యక్రమంలో అంబానీ కాబోయే కోడలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఈ ఈవెంట్ లో ముఖేశ్ అంబానీ దంపతుల కాబోయే కోడలు రాధికా మర్చంట్ తన హ్యాండ్ బ్యాంగ్ తో వార్తల్లో ప్రముఖంగా నిలిచారు.

NMACC Launching Event : అంబానీ ఫుడ్ అంటే ఈ రేంజ్ లో ఉంటుంది.. NMACC లాంచింగ్ లో సెలబ్రిటీలకు వెండి ప్లేట్స్‌లో ఫుడ్..

ఈ వేడుకలో కాస్ట్లీ బ్లాక్ కలర్ చీరలో ధగధగా మెరిసిపోతున్న రాధికా మర్చంట్ మినీ హ్యాండ్ బ్యాంగ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఆ బ్యాగ్ ధర సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ చిన్నపాటి హ్యాండ్ బ్యాగ్ లో మిక్ ఫ్రంట్ ఫ్లాప్ సిగ్నేచర్ కెల్లీ డిజైన్ తో పాటు చైన్ మెయిల్ బాడీ షోల్డర్ చైన్ వంటి మెరుపులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ మినీ హ్యాండ్ బ్యాగ్ ధర అక్షరాలా రూ. 52 ల లక్షల 30 వేలట..!! ఈ బ్యాగ్ చేతబట్టుకొని కాబోయే భార్యాభర్తలు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ జంట ఫోటోలకు ఫోజులిచ్చారు.

దీంతో మరి అంబానీ కాబోయే కోడలా…మజాకా? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అనంత్ అంబానీకి ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సీఈవో వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ తో గత జనవరిలో నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుక అంత్యంత గ్రాండ్ గా జరిగింది. త్వరలోనే వీరిద్దరి వివాహం జరుగనుంది. వీరిద్దరి పెళ్లి వేడక మరోసారి సోషల్ మీడియాలో హల్ చల్ చేయనుంది. మరి అంబానీ ఇంట్లో పెళ్లంటే మాటలా? అట్లుంటడి అంబానీతోని అన్నట్లుగా..